లిప్‌స్టిక్‌తో పనిలేకుండా పెదాలను ఎర్రగా మార్చేయొచ్చు..! 

అమ్మాయిలు అందంగా ఉండాలని అనుక్షణం తపిస్తారు. అమ్మాయిలు తమ అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల క్రీములు, హోం రెమెడీస్ వాడుతుంటారు. కళ్ళు, ముక్కు, చెవులు , బుగ్గలు వలె పెదవులు కూడా ముఖంలో చాలా ముఖ్యమైన భాగం. పెదవుల రంగు అందంలో కీలకం.. కొందరికి పెదాలు నల్లగా ఉంటాయి.

లిప్‌స్టిక్‌తో పనిలేకుండా పెదాలను ఎర్రగా మార్చేయొచ్చు..! 


అమ్మాయిలు అందంగా ఉండాలని అనుక్షణం తపిస్తారు. అమ్మాయిలు తమ అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల క్రీములు, హోం రెమెడీస్ వాడుతుంటారు. కళ్ళు, ముక్కు, చెవులు , బుగ్గలు వలె పెదవులు కూడా ముఖంలో చాలా ముఖ్యమైన భాగం. పెదవుల రంగు అందంలో కీలకం.. కొందరికి పెదాలు నల్లగా ఉంటాయి. సిగిరెట్లు తాగితే నల్లగా అవుతాయి అని చాలా మంది అంటుంటారు. ఇలా నల్లని పెదాలతో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. లిప్‌స్టిక్‌ డైలీ వేయలేం కదా..! బయటకు వెళ్లినప్పుడే వేసుకుంటారు. అసలు శాశ్వతంగా పెదాలను ఎర్రగా మార్చితే..? ఈ చిట్కాలతో మీ పెదాల రంగును మార్చేయొచ్చు తెలుసా..?
148,800+ Red Lips Stock Photos, Pictures & Royalty-Free Images - iStock |  Woman red lips, Red lips wine, Red lips close up
మీ పెదవులపై నల్లటి వలయాలు లేదా నల్ల మచ్చలు ఉంటే, మీరు దోసకాయను ఉపయోగించవచ్చు. దోసకాయ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. తాజా దోసకాయ ముక్కలను మీ పెదవులపై అరగంట పాటు ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ పెదవులు కొన్ని రోజుల్లో సహజంగా ఎర్రగా కనిపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు , సిలికా-రిచ్ కాంపౌండ్స్ దోసకాయలో కనిపిస్తాయి. పెదవులపై నల్ల మచ్చలను తొలగిస్తుంది.
పెదాలపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడంలో బీట్‌రూట్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల మీ నల్లని పెదవులు కొన్ని రోజుల్లో గులాబీ రేకులలా మృదువుగా మారుతాయి. మీ పెదాలకు సహజమైన రూపాన్ని అందించడానికి బీట్‌రూట్‌ను తొక్క తీసి తురమండి. తర్వాత మీ పెదాలపై అప్లై చేయండి. దాదాపు 15 నుంచి 20 నిమిషాల తర్వాత పెదాలను నీటితో కడగాలి. ఇలా తరచూ చేస్తుంటే మీ పెదాల త్వరగానే ఎర్రగా అవుతాయి. 
అలోవెరా జెల్ చర్మానికి ఒక వరంలా పనిచేస్తుంది. ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలకైనా కలబంద వాడకం చాలా మేలు చేస్తుంది. పెదవులు ఎర్రగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది.
వీటితో పాటు బ్రష్‌ చేసేప్పుడు ఆ పేస్ట్‌ నురగను పెదాలపై ఎక్కువ సేపు ఉంచకండి. కొంతమంది పెదాలు మొత్తం నురగతో నింపేస్తారు. వీలైనంత వరకూ పెదాలకు నురగ అంటకుండానే చూసుకోండి. అలాగే నిద్రలో చొంగకార్చే అలవాటు ఉన్నా పెదాల చుట్టూ నల్లగా అవుతుంది. ఈ అలవాటు ఉంటే..నిద్రలో కాస్త మేల్కూ వచ్చిన వెంటనే క్లీన్‌ చేసుకోవడం, ఉదయం లేవగానే ఫేస్‌ వాష్‌ చేసుకోవడం చేయండి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.