తరచూ వెన్ను నొప్పి వస్తుందా.. కిడ్నీలో స్టోన్స్‌ ఉన్నాయేమో..!!

కిడ్నీలో స్టోన్లు ఉండటం అనేది ఈరోజుల్లో పెద్ద సమస్య ఏం కాదు.. అందరికీ ఉంటున్నాయి.. మనిషి నాలుగు రాళ్లు వెనక వేసుకుంటే బాగుపడతాడు అని పెద్దోళ్లు అంటారు.. కానీ ఈ జనరేషన్‌ వాళ్లు..

తరచూ వెన్ను నొప్పి వస్తుందా.. కిడ్నీలో స్టోన్స్‌ ఉన్నాయేమో..!!


కిడ్నీలో స్టోన్లు ఉండటం అనేది ఈరోజుల్లో పెద్ద సమస్య ఏం కాదు.. అందరికీ ఉంటున్నాయి.. మనిషి నాలుగు రాళ్లు వెనక వేసుకుంటే బాగుపడతాడు అని పెద్దోళ్లు అంటారు.. కానీ ఈ జనరేషన్‌ వాళ్లు.. నాలుగు రాళ్లు కిడ్నీలో వేసుకుంటున్నారు అదేంటో..! మన జీవనశైలి వల్ల ఇలా జరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు పేరుకుపోతే.. ముందు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.. మీరు వాటిని లైట్‌ తీసుకుంటే.. సమస్య ఇంకా పెరిగి పెద్దదవుతుంది. మరి కిడ్నీలో రాళ్లు ఉంటే తొలినాళ్లలో కనిపించే లక్షణాలు ఏంటో చూద్దామా..!

మూత్ర పిండాల్లో రాళ్లు వ‌చ్చిన వారికి త‌ర‌చూ జ్వ‌రం వ‌స్తుంటుంది. కొద్ది రోజుల పాటు జ్వ‌రంగా ఉండి త‌గ్గుతుంది. మ‌ళ్లీ కొన్ని రోజుల‌ తర్వాత జ్వ‌రం వ‌స్తుంది.

బొడ్డుకు కింది భాగంలో రెండు వైపులా నొప్పి వ‌స్తుంది. స‌రిగ్గా అదే భాగంలో వెనుక వైపు కూడా నొప్పి వ‌స్తుంది. ఇలా నొప్పి వ‌స్తుంటే కిడ్నీ స్టోన్లు ఉన్నట్లే..

కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారిలో కొంద‌రికి వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. కొంద‌రికి వాంతులు కూడా అవుతుంటాయి. కొన్ని ర‌కాల ప‌దార్థాల వాస‌న‌లు చూస్తే క‌డుపులో తిప్పిన‌ట్లు అనిపిస్తుంది. వాంతికి అవుతుంది.

కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారికి కొన్ని సార్లు త‌ల తిరిగిన‌ట్లు అనిపిస్తుంది. స్పృహ త‌ప్పి ప‌డిపోతామోన‌న్న భావ‌న క‌లుగుతుంది.

 కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారిలో కొంద‌రికి వెన్ను నొప్పి వస్తుంది.

మూత్ర పిండాల్లో రాళ్లు ఉంటే అలాంటి వారు మూత్ర విస‌ర్జ‌న చేస్తే విపరీతమైన దుర్వాస‌న వ‌స్తుంది. మూత్రం లైట్ క‌ల‌ర్‌లో కాకుండా డార్క్ క‌ల‌ర్ లో వ‌స్తుంది.

 కొంద‌రికి మూత్ర పిండాల్లో రాళ్లు ఉంటే మూత్రంలో ర‌క్తం కూడా పడుతుంది.

 ఈ ల‌క్ష‌ణాలో ఎవ‌రిలో అయినా ఉంటే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి. కిడ్నీలో రాళ్లకు రాళ్ల సైజ్‌ను బట్టి చికిత్స చేస్తారు. మరీ పెద్దవి అయితే.. ఆపరేషన్‌ చేస్తారు.. చిన్నవి అయితే కరిగించేందుకు మందులు ఇస్తారు.. చాలా చిన్నవి అయితే ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మూత్రం ద్వారా బయటకు పోతాయి.. కాబట్టి లక్షణాలు ఉంటే.. కంగారుపడకుండా ముందు టెస్ట్‌ చేయించుకోవడం ఉత్తమం..! 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.