ఇలా చేస్తే తెల్ల జుట్టు నెలలో నల్లగా మారిపోతుంది.

ఇలా చేస్తే తెల్ల జుట్టు నెలలో నల్లగా మారిపోతుంది.
White hair


.

చిన్నవయసులోనే చాలా మంది తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. లైఫ్‌స్టైల్‌ మార్పులు, జన్యుపరమైన లోపాల వల్ల తెల్ల జుట్టు త్వరగా వస్తుంది. కొన్ని ఆహారపు అలవాట్లు మారిస్తే...దాదాపు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే మీరు తెల్లజుట్టును నల్లగా చేసేందుకు తాత్కాలిక మార్గాలను ఇప్పటి వరకూ పాటించి ఉంటారు. కానీ..ఈ చిట్కాను ఒక్కసారి ట్రై చేశారంటే..రిజల్ట్‌ మీకే తెలుస్తుంది. మార్కెట్‌లో దొరికే హెయిర్‌ డైలలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి..కాబట్టి ఇది జుట్టుకు అంత మంచిది కాదు. స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే ఓ పేస్ట్‌ను వాడ‌డం వ‌ల్ల త‌క్కువ ఖ‌ర్చుతో తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. దీనిని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు.

 ముందుగా ఒకటిన్న‌ర లీట‌ర్ నీళ్ల‌ను మ‌రిగించి పెట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో అర క‌ప్పు ఎండు ఉసిరి ముక్క‌ల‌ను, 4 కుంకుడు కాయ‌ల‌ను, అర క‌ప్పు షీకా కాయ‌ల‌ను వేసి.. ముందుగా మ‌రిగించి పెట్టుకున్న నీళ్లను పోసి.. 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద పెట్టుకుని 45 నిమిషాల పాటు నీళ్ల‌ను మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు చేతికి గ్లౌవ్స్ వేసుకుని మ‌రిగించిన నీటి నుండి పిప్పిని వేరు చేసి.. ఈ నీటిలో మ‌నం స‌హజ సిద్దంగా దొరికే హెన్నా పౌడ‌ర్‌ను ఒక క‌ప్పు వేసి బాగా క‌లిపి రెండు గంట‌ల పాటు అలాగే ఉంచాలి. ఇలా త‌యారు చేసుకున్న పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి జుట్టు చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించి రెండు గంట‌ల త‌రువాత ఎటువంటి షాంపూను వాడ‌కుండా.. మామూలు నీటితో త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు నల్ల‌గా మారుతుంది. దీనిని సులువుగా, త‌క్కువ ఖ‌ర్చుతో మ‌నం ఇంట్లో తయారు చేసుకోవ‌చ్చు. ఈ పేస్ట్‌ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మానికి కూడా ఎటువంటి హాని క‌ల‌గ‌దు. ఇది చేయడానికి కాస్త ఓపిక ఉండాలి అంతే..మీ దగ్గర ఆ ఓపిక ఉంటే ట్రై చేయండి..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.