Quinoa Rice : కినోవా రైస్ తినటం వల్ల ఎన్ని లాభాలో.. ముఖ్యంగా వెయిట్ లాస్‌, షుగర్ పేషెంట్స్..

మనం బ్రతకడానికి ప్రధానమైన ఆహారాలు ధాన్యాలు.. రాగులు, సజ్జలు, బియ్యం, గోధములు, కొర్రలు వీటన్నింటిలో కెల్లా ఎక్కువ మాంసకృతులు, ఎక్కువ సూక్ష్మపోషకాలు ఉన్న ఆహారం కీన్వా రైస్.. Quinoa Rice, Quinoa Rice health benefits

Quinoa Rice :  కినోవా రైస్  తినటం వల్ల ఎన్ని లాభాలో.. ముఖ్యంగా వెయిట్ లాస్‌, షుగర్ పేషెంట్స్..


మనం బ్రతకడానికి ప్రధానమైన ఆహారాలు ధాన్యాలు.. రాగులు, సజ్జలు, బియ్యం, గోధములు, కొర్రలు ఇలా. ఎవరి ప్రాంతాల్లో ఏది అందుబాటులో ఉంటే అది తింటుంటారు. వీటన్నింటిలో కెల్లా ఎక్కువ మాంసకృతులు, ఎక్కువ సూక్ష్మపోషకాలు ఉన్న ఆహారం ఒకటి ఉంది. ఇతర దేశాలనుంచి ఇది మనకు దిగుమతి అవుతుంది. ఈ మధ్య కొన్ని ఏరియాల్లో వీటిని కూడా సాగుచేస్తున్నారు. అదే కీన్వా రైస్. మనవాళ్లు అయితే వీటిని కినోవా రైస్ అంటుంటారు. ఇప్పటికే కొందరు ఈ రైస్ వల్ల వచ్చే పోషకాలను తెలుసుకుని వాడటం ప్రారంభించారు. ఈరోజు మనం ఈ రైస్ లో ఏం పోషకాలు ఉన్నాయి.. తినటం వల్ల ఎలాంటి లాభాలు కలగుతాయి అనేది చూద్దాం. 

ఇవి కొంచె ఖరీదైన రైస్. కేజీ 400-500 వరకూ ఉంటుంది. 100గ్రాముల కినోవా రైస్ లో ఉండే పోషకాలు ఏంటంటే

  • నీటిశాతం 13.3 గ్రాములు
  • శక్తి 368 కాలరీలు
  • పిండిపదార్థాలు 64.2 గ్రాములు
  • మాంసకృతులు 14.1 గ్రాములు
  • ఫ్యాట్ 6 గ్రాములు
  • పీచుపదార్థాలు 7 గ్రాములు
  • విటమిన్ E 2.4 మిల్లీ గ్రాములు
  • పొటాషియం 563 మిల్లీ గ్రాములు
  • ఫాస్పరస్ 457 మిల్లీ గ్రాములు
  • సిలీనియమ్ 8.5 మిల్లీ గ్రాములు
  • ఫోలిక్ యాసిడ్ 184 మైక్రోగ్రాములు
  • కోలిన్ 75 మిల్లీ గ్రాములు

ఇవి అన్నీ కినోవా రైస్ లో ఉన్న స్థూల, సూక్ష్మపోషకాలు. ఏ ధాన్యాలు తీసుకున్నా..7-11 గ్రాముల వరకే ప్రొటీన్ ఉంటుంది. కానీ ఈ రైస్ లో 14 గ్రాములు ఉన్నాయి. ఇవి తేలిగ్గా జీర్ణం అయ్యేస్తితిలో ఉంటుంది. భారతీయుల్లో చాలామందికి ప్రొటీన్ లోపం ఎక్కువగా ఉంటుంది. చంటిపిల్లలకు ముఖ్యంగా ఈ రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరిపాలతో ఈ రైస్ చేసి పెడితే..ఎంతో మంచిది. పిల్లల ఎదుగుదలకు బాగా పనికొస్తుంది. 

  1. ముసలివారు దంతాలు లేని వాళ్లు ఉంటే.. వారికి కూడా ఈ రైస్ బాగా ఉపయోగపడుతుంది.
  2. గర్భవతులుకు కూడా ఇతర మిల్లెట్స్ తింటే కంటే.. కినోవా రైస్ తింటే చాలా మంచిది. అన్నం వండుకునేప్పుడు.. కొబ్బరిపాలు లేదా తోటకూర రసం లేదా పాలకూర రసం తీసి వాటితో రైస్ చేసుకుంటే చాలా మంచిది. పుట్టబోయే బిడ్డకు అన్ని పోషకాలు ఆహారం ద్వారా అందించినట్లే.
  3. కినోవా రైస్ లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది.. ఇతర ధాన్యాల్లో లేనంత అధికంగా ఉంది. గర్భవతులకు 600 మైక్రోగ్రాముుల కావాలి. రెండూపూట్ల ఈ రైస్ తింటే..చాలు రిచ్ గా అందుతుంది.
  4. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల..ప్రేగుల క్లీనింగ్, మోషన్ బాగా అవడానికి ఉపయోగపడుతుంది. రక్తంలో చెక్కరె స్థాయిలు పెరగకుండా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్ కి తెల్లటి బియ్యం అస్సలు మంచిది కాదు. అలాంటివారు కినోవా రైస్ ను తినొచ్చు.
  5. బరువు పెరగకుండా తినాలి అనుకునే వారికి కూడా కినోవా రైస్ మంచిదే.. కడుపునిండా తిన్నా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి డబ్బులకు ఇబ్బందిలేదు అనే వాళ్లు హ్యాపీగా ఈ రైస్ తెచ్చుకుని తినొచ్చు. ఆటలు ఆడేవారికి, పిల్లలకు, గర్భిణీలకు, వృద్ధులకు, బలం బాగా కావాలి అనుకునే వారి ఇలా అందరికి ఈ రైస్ ఉపయోగపడుతుంది. అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి కావాల్సిన వారు ఉపయోగించుకోండి..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.