Chedu dondakaya : మధుమేహంను అద్భుతంగా కంట్రోల్‌ చేసే చేదు దొండకాయ.. రిజల్ట్‌ పక్కా..!

పంట పొలాల దగ్గర, చెరువు గట్ల‌ మీద‌, చేనుకు వేసిన కంచెల‌కు అల్లుకుని పెరిగే కాకర దొండ‌ను ఉప‌యోగించి మ‌నం ఈ వ్యాధి నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కాకర దొండ చూడ‌డానికి మ‌నం తినే దొండ‌కాయ లాగే ఉంటుంది. దీనిని అడ‌వి దొండ, chedu dondakaya అని కూడా పిలుస్తారు..

Chedu dondakaya : మధుమేహంను అద్భుతంగా కంట్రోల్‌ చేసే చేదు దొండకాయ.. రిజల్ట్‌ పక్కా..!
chedudondakaya controls diabetics


షుగర్‌ వ్యాధి తగ్గేదేలేదు అన్నట్లు.. ఈరోజు అందరి ఇళ్లలో చేరింది. రోజు రోజుకు ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతుంది. షుగర్‌, బీపీ వచ్చిందంటే..జీవితాంతం ఆ చేదు మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి.. లేదంటే బాడీ సహకరించదు.. ప్రాణం నిలవదు. ఇంగ్లీష్‌ మందులకంటే.. ఆయుర్వేదంతోనే ఇలాంటి దీర్ఘకాలక రోగాలను నియంత్రించుకోవచ్చు. ఆయుర్వేదంలో చాలా చిట్కాలు ఉన్నాయి.. అందులో ఒకటి కాకరదొండ కాయ..

పంట పొలాల దగ్గర, చెరువు గట్ల‌ మీద‌, చేనుకు వేసిన కంచెల‌కు అల్లుకుని పెరిగే కాకర దొండ‌ను ఉప‌యోగించి మ‌నం ఈ వ్యాధి నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కాకర దొండ చూడ‌డానికి మ‌నం తినే దొండ‌కాయ లాగే ఉంటుంది. దీనిని అడ‌వి దొండ, chedu dondakaya అని కూడా పిలుస్తారు.. మ‌న‌కు గ్రామాల‌లో ఈ అడ‌వి దొండ తీగ‌ చెట్టు విరివిరిగా క‌న‌బడుతుంది. ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని ఉంటుంది.. ఈ అడ‌వి దొండ తీగ చెట్టు ఎక్కువ‌గా పెరుగుతుంది.

షుగ‌ర్ వ్యాధిని న‌యం చేయ‌డంలో ఇవి అద్భుతంగా ప‌ని చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ అడ‌వి దొండ‌కాయ‌లు ప‌చ్చ‌గా ఉన్న‌ప్పుడు ఎంత చేదుగా ఉంటాయో పండిన త‌రువాత అంత తియ్య‌గా ఉంటాయి. ఈ అడ‌వి దొండ‌కాయ‌లను కూర‌గా చేసుకుని తిన‌వ‌చ్చు. దీంతో షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది. ఈ కాయ‌ల‌ను ముక్క‌లుగా చేసి ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. 

ఈ పొడిని ఏదో ఒక రూపంలో ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా షుగ‌ర్ వ్యాధి తగ్గుతుంది. పచ్చి కాయ‌ల‌ను తిన‌లేని వారు ఈ కాయ‌లు పండిన త‌రువాత వీటిని తిన‌డం వ‌ల్ల కూడా షుగ‌ర్ వ్యాధి న‌యం అవుతుంది. ఈ విధంగా అడ‌వి దొండ కాయ‌ల‌ను వాడి మ‌నం షుగ‌ర్ వ్యాధి నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు. మీకు కూడా షుగర్‌ ఉన్నట్లైతే.. ఇలాంటి ప్రయత్నం ఒకసారి చేసి చూడండి.! ఆయుర్వేద వైద్యం వల్ల రిజల్ట్‌ ఉంటుంది కానీ కాకపోతే కాస్త టైమ్‌ పడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.