పార్శ కోనాశనం: కీళ్లనొప్పులు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

ఇప్పుడున్న ఆహారపు అలవాట్లకు ప్రతి ఒక్కరు కచ్చితంగా రోజులో ఎంతో కొంత శారీరక శ్రమ చేయాల్సిందే. శారీరక శ్రమ అంటే రోజూ జాబ్‌ చేస్తూ అలిసిపోతున్నాం కదా అంటారేమో అది వేరు. వాకింగ్‌, యోగా, వ్యాయామం ఇలాంటవన్నీ కనీసం రోజులో అరగంటపాటైనా చేస్తేనే

పార్శ కోనాశనం: కీళ్లనొప్పులు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది


ఇప్పుడున్న ఆహారపు అలవాట్లకు ప్రతి ఒక్కరు కచ్చితంగా రోజులో ఎంతో కొంత శారీరక శ్రమ చేయాల్సిందే. శారీరక శ్రమ అంటే రోజూ జాబ్‌ చేస్తూ అలిసిపోతున్నాం కదా అంటారేమో అది వేరు. వాకింగ్‌, యోగా, వ్యాయామం ఇలాంటవన్నీ కనీసం రోజులో అరగంటపాటైనా చేస్తేనే రోగాల భారిన పడకుండా ఉండొచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కీళ్లనొప్పులు, మలబద్దకంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వీరు రోజు కనీసం ఒక 10 నిమిషాల పాటు పార్శ కోణాసనాన్ని వేస్తే ఈజీగా కీళ్ల నొప్పుల నుంచి విముక్తిపొందవచ్చు. ఈరోజు పార్శ కోనాశనం ఎలా వేయాలి.. కలిగే లాభాల గురించి తెలుసుకుందాం
Yoga Asana Directory - Wellness Haven Yoga

పార్శ కోనాశనం వేసే పద్దతి:

ఏ యోగాసనం అయినా వేసేముందు ఒక ఐదనిమిషాల పాటు వార్మప్‌ చేయాలి. అప్పుడే మన శరీరం యోగా చేసే మూడ్‌లోకి వస్తుంది. ఆ తర్వాతే ఆసనాలు వేయడం స్టాట్‌ చేయాలి. అలాగే యోగా ఎప్పుడు మంచాలా మీద చేయకూడదు. ఒక చాప లేదా యోగా మ్యాట్‌ మీదనే చేయాలి. ఇప్పుడు ఈ ఆసనం వేయడానికి మొదట నిటారుగా నిలబడాలి. తర్వాత ఊపిరి పీల్చుకొని పాదాలు ఒక మీటరు దూరం జరపాలి. అరచేతులు భూమివైపుగా ఉంచాలి. తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ కుడి పాదాన్ని కుడివైపుగా తిప్పుతూ 90 డిగ్రీల కోణంలో వంచాలి. ఈ సమయంలో ఎడమకాలును స్టిఫ్‌గా ఉంచాలి ఇప్పుడు కుడి అరచేతిని కుడికాలి పక్కగా ఉంచి ఎడమ చేతిని ఎడమ చెవి మీదుగా భూమికి సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో అర నిమిషం పాటు రిలాక్స్ గా ఉండాలి. తర్వాత గాలి పీలుస్తూ ముందుగా కాలును, తర్వాత చేతిని యథాస్థితికి తీసుకురావాలి. ఇదే విధంగా ఎడమవైపు కూడా చేయాలి. ఇలా 8నుంచి 10 సార్లు చేయాలి

పార్శ కోనాశనం వలన కలిగే ప్రయోజనాలు

ఈ ఆసనం కాలి మడమలు, మోకాళ్లు మొదలైన జాయింట్స్‌కు రిలాక్స్ నిస్తుంది. 
కీళ్లనొప్పులు, సయాటికాలను తగ్గిస్తుంది
నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది. 
మలబద్దకాన్ని నివారిస్తుంది. 
సూచన: ఈ ఆసనం మోకాలి నొప్పులున్నవారు వేయకూడదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.