రాగి జావ తాగడం వల్ల లాభాలే కాదు.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండోయ్..!!

రాగి జావ చేసుకోవడం చాలా తేలికైన పని.. కానీ దాన్ని తాగడం వల్ల ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువే.. ఇది మీరు రోజూ ఒక గిన్నే తీసుకుంటే చాలు. మీకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అయితే రాగి జావ

రాగి జావ తాగడం వల్ల లాభాలే కాదు.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండోయ్..!!


రాగి జావ చేసుకోవడం చాలా తేలికైన పని.. కానీ దాన్ని తాగడం వల్ల ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువే.. ఇది మీరు రోజూ ఒక గిన్నే తీసుకుంటే చాలు. మీకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అయితే రాగి జావ గురించి ఎప్పుడు పాజిటివ్‌ టాక్‌ మాత్రమే విని ఉంటారు.. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా కొన్ని ఉన్నాయి తెలుసా..?
 

 రాగి జావ వల్ల కలిగే దుష్ప్రభావాలు

అధిక బరువు ఉన్నవారు లేదా మధుమేహం వంటి కొన్ని జీవనశైలి రుగ్మతలు ఉన్నవారు రాగిజావను తీసుకోవచ్చు. అయినప్పటికీ.. దీనిని మీరు ఎక్కువగా తీసుకుంటే.. కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. 

అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వచ్చే అవకాశముంది.

మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే మంచిది.

బరువు పెరగాలనుకునేవారు దీనిని కొంచెంగా తీసుకోవాలి..

కొందరికి దీని వల్ల అలర్జీ రావచ్చు. అలా ఏమైనా అనిపిస్తే.. మీరు వెంటనే దానిని తీసుకోవడం ఆపేయండి.

ఇక ఈ సమస్యలను పక్కనపెడితే.. రాగి జావ వల్ల కలిగే లాభాలు ఏంటంటే..

రాగి జావలో కనిపించే ప్రధాన ప్రోటీన్ కంటెంట్ ఎలుసినియన్. ఇది పోషకాహార లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను రవాణా చేయడంలో సహాయం చేస్తుంది.

రాగిజావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. అందుకే లావు అవ్వాలి అనుకునేవాళ్లు దీన్ని కొంచెంగా తినాలి అంటున్నారు.

రాగి జావను రోజూ తీసుకుంటే.. ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు.. ట్రిప్టోఫాన్, అమైనో ఆమ్లాలు, సహజ సడలింపుగా పని చేసి.. మీకు విశ్రాంతిని అందిస్తుంది.

రాగి జావను రోజూ తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే రాగి జావలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్‌లు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడానికి తగినంత ఇన్సులిన్‌ను స్రవించదు.

రాగి జావలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇది సోడియం లేనిది. కాబట్టి మీకు గుండె జబ్బు ఉన్నప్పటికీ రాగి పిండి ఆధారిత వంటకాలను తినడం సురక్షితమే.  
 
రాగి జావ సహజ ఇనుముకు గొప్ప మూలం. రక్తహీనత ఉన్నవారికి, తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

రాగి జావలో కాల్షియం ఉంటుంది. కాల్షియం అనేది ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ఖనిజం. మానవ శరీరం రోజూ మన ఎముకల నుంచి చిన్న పరిమాణంలో కాల్షియంను తొలగిస్తుంది.

రాగి జావలో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది మీ చర్మానికి మేలు చేస్తుంది. విటమిన్ ఇ శరీరంపై గాయాలను తగ్గిస్తుంది.. ఇది మీ చర్మంపై రక్షిత పొరను ఏర్పరుస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.