చంద్ర నమస్కారాలు చేస్తే శరీరం చల్లగా అవుతుందట..!

సూర్య నమస్కారం గురించి మనకు తెలుసు.. రోజూ ఉదయం చేయడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీకు చంద్రనమస్కారాల గురించి తెలుసా..? ఎప్పుడైనా విన్నారా..? చంద్ర నమస్కారాలు అనేవి సాయంత్ర పూట అభ్యసించే ఆసనాలు. నిజానికి చంద్రుడు స్వంతంగా ప్రకాశించలేడు, సూర్యుని కాంతిని గ్రహించి

చంద్ర నమస్కారాలు చేస్తే శరీరం చల్లగా అవుతుందట..!


సూర్య నమస్కారం గురించి మనకు తెలుసు.. రోజూ ఉదయం చేయడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీకు చంద్రనమస్కారాల గురించి తెలుసా..? ఎప్పుడైనా విన్నారా..? చంద్ర నమస్కారాలు అనేవి సాయంత్ర పూట అభ్యసించే ఆసనాలు. నిజానికి చంద్రుడు స్వంతంగా ప్రకాశించలేడు, సూర్యుని కాంతిని గ్రహించి మాత్రమే ప్రతిబింబింస్తాడు. కాబట్టి ఈ చంద్ర నమస్కారం కూడా సూర్య నమస్కారంకు ప్రతిబింబం లాంటిదని నిపుణులు అంటున్నారు. చంద్ర నమస్కారాలు రాత్రిపూట ముఖ్యంగా చంద్రుడు కనిపించే సమయంలో ఆచరిస్తారు, చంద్ర నమస్కారాలు చేసేటపుడు కూడా కడుపు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. చంద్రనమస్కారాలు చేయడం ద్వారా శరీరం, మనసుపై చల్లని ప్రశాంతమైన ప్రభావాలను కలిగుతాయట.
Yoga Day 2022 अच्छी नींद के साथ सेहतमंद रहने के लिए चंद्र नमस्कार का करें  अभ्यास - international yoga day 2022 Chandra Namaskar Benefits moon  salutation steps and benefits

చంద్ర నమస్కారాలను ఆచరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది..

ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పే వాత, పిత్త, కఫా దోషాలను చంద్ర నమస్కారాలు తగ్గిస్తాయట...మండే వేసవిలో శరీరంలో వేడి-సంబంధిత పిత్త దోషాల పెరుగుదల కనిపిస్తుంది. చంద్ర నమస్కారం ఈ వేడిని తగ్గిస్తుంది. అదనపు పిత్తను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

హార్మోన్ల సమతుల్యత

అమావాస్య లేదా పౌర్ణమికి శరీరంలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు కొందరిలో గమనించవచ్చు. అందుకే కొందరు అమావాస్య, పౌర్ణమికి కాస్త విచిత్రంగా, భిన్నంగా ప్రవర్తిస్తారు.. ముఖ్యంగా ఆడవారిలో ఋతుచక్రంలో మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి, ఇది మూడ్ స్వింగ్స్‌కు దారితీస్తుంది. రొమ్ముల సున్నితత్వం, ఉబ్బరం, మొటిమలు, ఆకలిలో మార్పులు వంటి సమస్యలు ఉంటాయి. చంద్ర నమస్కారాలు వీటికి పరిష్కరిస్తాయి.

శరీరానికి చల్లదనం..

చంద్ర నమస్కారం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేడి వేసవి రోజులలో చంద్రనమస్కారాల మృదువైన, మనోహరమైన కదలికలు మీలోని అధిక వేడి విడుదల చేసి మిమ్మల్ని ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంచుతాయి.. మీలోని ఉద్రిక్త భావాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ప్రశాంతమైన నిద్ర

చంద్ర నమస్కారాలు శరీరాన్ని, మనస్సును శాంతపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. అందులోని ఈ యోగా భంగిమలను సాయంత్రం వేళ ఆచరించడం వలన మీ శరీరాన్ని, మనస్సును ప్రశాంతమైన నిద్ర దక్కుతుంది. 

సృజనాత్మకత పెరుగుతుంది

చంద్ర నమస్కారం చంద్ర శక్తిని ప్రసారం చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇది సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తుంది.

కండరాలకు ప్రయోజనం

శారీరక ప్రయోజనాలను పరిశీలిస్తే వెన్నెముక, హామ్ స్ట్రింగ్స్, కాళ్ళ వెనుక , కడుపు కండరాలను కూడా సాగదీస్తుంది వాటిని బలోపేతం చేస్తుంది. రక్త ప్రసరణ, శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థల పనితీరును కూడా సమతుల్యం చేస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.