ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. ఈ తప్పులు వదిలేసి వీటిని తినండి

మనిషి శరీరంలో ఎముకలు చాలా కీ రోల్‌ ప్లే చేస్తాయి. ఇవి కరెక్టుగా ఉంటేనే మనిషి స్ట్రైట్‌గా నిలబడతాడు, మోకాళ్లు, వెన్నునొప్పులు లాంటివి రాకుండా ఉంటాయి. మనకు 206 ఎముకలు ఉంటాయి. ప్రతీ ఎముక చాలా

ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. ఈ తప్పులు వదిలేసి వీటిని తినండి


మనిషి శరీరంలో ఎముకలు చాలా కీ రోల్‌ ప్లే చేస్తాయి. ఇవి కరెక్టుగా ఉంటేనే మనిషి స్ట్రైట్‌గా నిలబడతాడు, మోకాళ్లు, వెన్నునొప్పులు లాంటివి రాకుండా ఉంటాయి. మనకు 206 ఎముకలు ఉంటాయి. ప్రతీ ఎముక చాలా ముఖ్యమైనది. ఎముకల్లో సత్తువ లేకపోతే.. ఏ పని చేయలేరు. ఏదీ పట్టుకోలేరు కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల నొప్పులు, ఇతర సమస్యలు రావడం సర్వసాధారణం. కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలు రావడం మొదలయ్యాయి. భవిష్యత్తులో మీ ఎముకల ఆరోగ్యంగా ఉండాలంటే.. మీ ఆహారంలో కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చుకోండి.
How To Build Strong Bones Naturally
మీ రోజువారీ ఆహారం, జీవనశైలి, నిద్ర, వ్యాయామం ఎలా ఉన్నాయనే దానిపై మీ శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీ శారీరక ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నిజానికి సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కలిసి ఎముకలను దృఢంగా చేస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం. చికెన్, మటన్ వంటి అనేక జంతు ప్రోటీన్ ఆహారాలు మీ శరీరంలో కాల్షియంను తగ్గిస్తాయి. కాబట్టి వాటిని ఎక్కువగా తినకూడదు.
అధికంగా మద్యం తాగడం వల్ల బోలు ఎముకల వ్యాధి వస్తుంది. టీ, కాఫీలలో లభించే కెఫిన్ కాల్షియం లోపానికి కారణమవుతుంది. కాబట్టి వాటిని తగ్గించండి. డైలీ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. 
మీరు చిన్నప్పటి నుంచే యోగా, వ్యాయామం లాంటివి అలవాటు చేసుకుంటే.. పెద్దయ్యే సరికి మీ ఎముకలు స్ట్రాంగ్‌గా అవుతాయి. ఎముక ఆరోగ్యానికి ఈ ఆహారాలను మీ డైట్‌లో భాగం చేసుకోండి. 
బాదం,
పచ్చి ఆకుకూరలు,
పెరుగు,
ఆలివ్ నూనె, 
అరటిపండు, 
ఆరెంజ్, 
నువ్వులు, 
సోయా, 
కొవ్వు చేపలు.
వీటిని ఎదిగేపిల్లలకు రెగ్యులర్‌గా ఇస్తుంటే వారి ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయి. అలాగే మహిళలు కూడా వెన్నునొప్పితో చాలా బాధపడుతుంటారు. వారు ఈ ఆహారాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది. డైలీ నానపెట్టిన బాదంపప్పుతినడం, మధ్యాహ్నం నువ్వులతో చేసిన లడ్డు తినడం, వారానికి రెండుసార్లు అయినా కూరల్లో సోయా వాడుకోవడం, అరటిపండు, ఆరెంజ్‌ వంటి ఫ్రూట్స్‌ అప్పుడప్పుడు తినడం, చేపలను కూడా వీలైనప్పుడు తినొచ్చు. పెరుగు రోజూ తినండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.