జిమ్‌కు వెళ్లడం వల్ల ఈ అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.. జర పైలం..!

జిమ్‌కు వెళ్లడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, బరువు తగ్గాలనుకుంటే తగ్గొచ్చు, పెరగాలనుకుంటే పెరగొచ్చు అని మనకు తెలుసు. కానీ జిమ్‌కు వెళ్లడం వల్ల కూడా అంటువ్యాధులు వస్తాయని మీరెప్పుడైనా ఆలోచించారా..? జిమ్‌లో కష్టపడి వ్యాయామాలు చేసి చెమటలు పటిస్తాం.

జిమ్‌కు వెళ్లడం వల్ల ఈ అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.. జర పైలం..!


జిమ్‌కు వెళ్లడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, బరువు తగ్గాలనుకుంటే తగ్గొచ్చు, పెరగాలనుకుంటే పెరగొచ్చు అని మనకు తెలుసు. కానీ జిమ్‌కు వెళ్లడం వల్ల కూడా అంటువ్యాధులు వస్తాయని మీరెప్పుడైనా ఆలోచించారా..? జిమ్‌లో కష్టపడి వ్యాయామాలు చేసి చెమటలు పటిస్తాం. ఎదుటి వాళ్లు వాడిన డంబుల్‌, ఇంకా మెషిన్స్‌ మనం వాడతాం. అప్పుటికే వారికి ఫుల్‌గా చెమటలు పట్టి ఆ బాక్టీరియా అంతా వాటికి అంటుకోని ఉంటుంది. మనం మళ్లీ వాటిని బాడీకి బాగా దగ్గరగా పెట్టుకోని చేయాలి. జిమ్‌లో అంటువ్యాధులు రావడానికి కారణాలు, ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఓసారి క్లియర్‌గా చూద్దామా..! 
Full-Body Gym Workout For Women | POPSUGAR Fitness

జిమ్‌లో అంటువ్యాధులు రావడానికి కారణం ఏంటి?

అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వెచ్చగా మూసి ఉన్న, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి. కొన్ని అంటువ్యాధులు వీటి ద్వారానే వ్యాపిస్తాయి. డంబెల్స్, కెటిల్ బెల్స్, యోగా చాపలు వంటి పరికరాలు ఒకరికి పది మంది ఉపయోగిస్తారు. వాటి మీద ఉండే సూక్ష్మక్రిములు చర్మంతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. చివరికి కొన్ని చర్మ పరిస్థితులకు దారి తీస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం చర్మ వ్యాధులు, అనారోగ్యాలని దారి తీసే బ్యాక్టీరియా 10-30 శాతం జిమ్‌లోనే ఉంటాయని తేలింది.

రింగ్వార్మ్

ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్వార్మ్ చర్మంపై గుండ్రంగా ఏర్పడుతుంది. ఇది దురదగా అనిపిస్తుంది. చర్మం సహా శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఒక శరీర భాగం నుంచి మరొక చోటుకి వేగంగా వ్యాపిస్తుంది. రింగ్వార్మ్ వెచ్చగా, తేమగా ఉండే ప్రదేశాలలో వృద్ధి చెందుతుంది. చెమటతో కూడిన పరికరాలు లేదా బెంచీలు వీటికి ఆవాసాలు.  

అథ్లెట్ ఫుట్

టేనియా పెడిస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్. దురద, పొడి, ఎరుపు చర్మం ఏర్పడుతుంది. చర్మంపై పగుళ్లు కలిగిస్తుంది. ఎక్కువగా కాళీ వేళ్ళ మధ్య లేదంటే చుట్టు పక్కల పాదాల మొత్తం ఇది వస్తుంది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. చెమట కారణంగా పాదాలు తేమగా ఉన్నప్పుడు ట్రైకొఫైటన్ రబ్రమ్ అనే శిలీంధ్రాల వల్ల వస్తుంది. మంటని కలిగిస్తుంది. యాంటీ ఫంగల్ క్రీములు, జెల్స్ రాసుకోవచ్చు. అలాగే కాలి వేళ్ళని శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. అప్పుడే ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

ఫోలిక్యులిటిస్

ఇది చాలా బాధకరమైన దురదతో కూడిన పరిస్థితి. మొటిమల మాదిరిగానే ఎరుపు రంగు గడ్డలు కలిగిస్తుంది. చాలా మంది వ్యక్తులు దీనికి ఎక్కువగా ప్రభావితమవుతారు. మెడ, చంకలు, తొడలపి ఏర్పడే హెయిర్ ఫోలికల్స్, రూట్స్‌లో ఈ బ్యాక్టీరియా చేరుతుంది. ఎక్కువగా చెమట పట్టినా, మురికి పరికరాలు ఉపయోగించడం ద్వారా ఇది అభివృద్ధి చెందుతుంది.

పులిపిర్లు

వీటిని వెర్రూకె మొటిమలు అని కూడ పిలుస్తారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల సంభవిస్తాయి. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో దాడి చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న చాలా మంది వ్యక్తుల గాయాలు తీవ్రమవుతుంటే బాధ తట్టుకోలేరు. ఈ వైరస్ శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తుంది. దీని వల్ల విపరీతమైన నొప్పిగా ఉంటుంది.

స్టాఫ్

స్టాఫ్, స్టెఫీలోకాకస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చర్మం మీద స్క్రాచ్ లేదా కట్ అయినప్పుడు ఇది తీవ్రమవుతుంది. షేర్డ్ జిమ్ పరికరాలు, దుస్తులు, ఖర్చిఫ్స్ కారణంగా ఇది వ్యాపిస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.