మండూకాస‌నం : తొడ భాగంలో కొవ్వును ఈ ఒక్క ఆసనంతో సింపుల్‌గా కరిగించేయొచ్చు..!

ఈరోజుల్లో లావుగా ఉండటం ఒక సమస్య అయితే.. ఎక్కడపడితే అక్కడ కొవ్వు ఉండటం ఇంకో సమస్య. పొట్ట దగ్గర, తొడలు, పిరదులు ఇలా శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.. ఇంకా లావుగా ఉంటే షుగర్‌

మండూకాస‌నం : తొడ భాగంలో కొవ్వును ఈ ఒక్క ఆసనంతో సింపుల్‌గా కరిగించేయొచ్చు..!


ఈరోజుల్లో లావుగా ఉండటం ఒక సమస్య అయితే.. ఎక్కడపడితే అక్కడ కొవ్వు ఉండటం ఇంకో సమస్య. పొట్ట దగ్గర, తొడలు, పిరదులు ఇలా శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.. ఇంకా లావుగా ఉంటే షుగర్‌, ఊబకాయం లాంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే రోజు వ్యాయామం చేయమని వైద్యులు చెప్తారు.. యోగాను మంచిన వ్యాయామం ఇంకే ముందిచెప్పడి.. యోగాతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.. బాడీ మొత్తం క్లీన్‌ అవుతుంది. రోజూ వ్యాయామం చేసేంత ఓపిక లేనివారు క‌నీసం ఈ ఆసనాన్ని అయినా స‌రే రోజుకు 10 నిమిషాల పాటు వేయండి.. దీంతో ఆయా వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి ఆ ఆస‌నం ఏంటంటే..

యోగాలో అనేక ర‌కాల ఆస‌నాలు ఉన్నాయి. ఒక్కో ఆస‌నం భిన్న ర‌కాల అనారోగ్యాల‌ను న‌యం చేయ‌డానికి ప‌నికొస్తుంది. ఇక ఆ ఆస‌నాల్లో మండూకాస‌నం కూడా ఒక‌టి. క‌ప్ప ఎలా ఉంటుందో అలా ఈ ఆస‌నం వేయాలి.. దీన్ని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మండూకాస‌నం వేసే విధానం..

ముందుగా నేల‌పై వ‌జ్రాస‌నం వేసి కూర్చోవాలి. రెండు అర‌చేతుల పిడికిళ్ల‌ను బిగించాలి. వాటిని పొట్ట వ‌ద్ద‌కు తెచ్చి ఒక దానితో మ‌రొక‌దాన్ని ప‌ట్టుకోవాలి. అనంతరం పొట్ట ద‌గ్గ‌ర పిడికిళ్ల‌ను అలాగే ప‌ట్టుకుని ఉండి ముందుకు వంగాలి. ఈ భంగిమ‌లో గాలి పీల్చుతూ వీలైనంత సేపు ఉండాలి. తిరిగి య‌థాస్థితికి రావాలి. ఈ ఆస‌నాన్ని రోజూ క‌నీసం 10 నిమిషాల పాటు వేయ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

మండూకాస‌నం ప్ర‌యోజ‌నాలు..

  • శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌కు ఈ ఆస‌నం ఎంత‌గానో మేలు చేస్తుంది. అన్ని అవ‌య‌వాల‌ను ప‌రిపుష్టంగా మారుస్తుంది.
  • మండూకాస‌నం వేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.
  • తొడ‌ల వ‌ద్ద ఉండే కొవ్వు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కరుగుతుంది.
  • ఈ ఆస‌నం వ‌ల్ల అన్ని ర‌కాల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
  • మండూకాస‌నం వేయ‌డం వ‌ల్ల మోకాళ్లు, మ‌డ‌మ‌లు దృఢంగా మారుతాయి. ఆయా భాగాల్లో ఉండే నొప్పులు పోతాయి.
  • భుజాలు, పొట్ట కండ‌రాలు దృఢంగా మారుతాయి. 
  • క్లోమ గ్రంథి, గుండె జ‌బ్బుల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఈ ఆస‌నం వేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.