హైబీపీ, షుగర్‌ ఉన్నవాళ్లు నల్లద్రాక్షాలను తినొచ్చా..?

మార్కెట్‌లో చాలా రకలా ఫ్రూట్స్‌ ఉంటాయి. ఏ పండు అయినా.. ఆరోగ్యానికి మంచిదే.. సీజన్‌తో సంబంధం లేకుండా ఏ టైమ్‌లో అయినా ద్రాక్షాలు ఉంటాయి. గ్రేప్స్‌లో బ్లాక్‌ గ్రేప్స్‌ ఆర్యోగానికి మంచివి. ద్రాక్ష‌ల‌ను తిన‌డం

హైబీపీ, షుగర్‌ ఉన్నవాళ్లు నల్లద్రాక్షాలను తినొచ్చా..?


మార్కెట్‌లో చాలా రకలా ఫ్రూట్స్‌ ఉంటాయి. ఏ పండు అయినా.. ఆరోగ్యానికి మంచిదే.. సీజన్‌తో సంబంధం లేకుండా ఏ టైమ్‌లో అయినా ద్రాక్షాలు ఉంటాయి. గ్రేప్స్‌లో బ్లాక్‌ గ్రేప్స్‌ ఆర్యోగానికి మంచివి. ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం ఒక క‌ప్పు మోతాదులో తీసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
న‌ల్ల ద్రాక్ష‌ల్లో రెస్వెరెట్రాల్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. అలాగే శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు. ర‌క్త నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌వు. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.
నల్ల ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు-Namasthe Telangana
న‌ల్ల ద్రాక్ష‌ల్లో లుటీన్‌, జియాజాంతిన్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ ద్రాక్ష‌ల‌ను తింటే కంటి చూపు మెరుగు ప‌డుతుంది. కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
న‌ల్ల ద్రాక్ష‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. అలాగే క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి. దీని వ‌ల్ల క్యాన్స‌ర్‌లు రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు.
న‌ల్ల‌ద్రాక్ష‌ల్లో రైబో ఫ్లేవిన్ అధికంగా ఉంటుంది. ఇది మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతుంది. మెద‌డు యాక్టివ్‌గా మారి చురుగ్గా ప‌నిచేస్తుంది. చిన్నారులు అయితే చ‌దువుల్లో రాణిస్తారు. తెలివితేట‌లు పెరుగుతాయి.
డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దృఢంగా మారుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. చ‌ర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
న‌ల్ల ద్రాక్ష‌ల్లో విట‌మిన్ సి, కె, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. అలాగే ఇత‌ర వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. దీర్ఘకాలిక రోగాలు అయినా.. బీపీ, షుగర్‌ ఉన్నవారు..తరచూ నల్లద్రాక్షాలను తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.