ఎన్ని చేసిన డయాబెటిస్‌ తగ్గడం లేదా? అయితే ఇది ఫాలో అయిపోండి

చాలా మందికి ఎన్ని చేసినా డయాబెటిస్‌ తగ్గదు. ఎంత కంట్రోల్‌లో ఉన్నా మితిమీరి పోతూ ఉంటుంది. మందులు వేసుకుంటున్నా అదుపులో ఉండదు. అలాంటి వారు ఈ డైట్‌ ఫాలో అయితే డయాబెటిస్‌ మన అధీనంలోకి వస్తుంది.

ఎన్ని చేసిన డయాబెటిస్‌ తగ్గడం లేదా? అయితే ఇది ఫాలో అయిపోండి


చాలా మందికి ఎన్ని చేసినా డయాబెటిస్‌ తగ్గదు. ఎంత కంట్రోల్‌లో ఉన్నా మితిమీరి పోతూ ఉంటుంది. మందులు వేసుకుంటున్నా అదుపులో ఉండదు. అలాంటి వారు ఈ డైట్‌ ఫాలో అయితే డయాబెటిస్‌ మన అధీనంలోకి వస్తుంది. కాబట్టి ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ దినచర్య ప్రారంభిస్తే.....అదుపులో లేని షుగర్‌ వ్యాధికి ఇట్టే చెక్‌ పెట్టేయోచ్చు. మరి ఆ డైట్‌ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Types of Diabetes: Causes, Identification, and More

నిద్ర లేచిన వెంటనే కొంచెం కొంచెంగా లీటర్‌ నీళ్లు తాగేయండి. ఒకేసారి తాగడం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. నీళ్లు తాగేసాక మోషన్‌కు వెళ్లడానికి ప్రయత్నించండి. దానిమీద దృష్టి పెడితే దానంతట అదే వచ్చేస్తుంది. ఒకవేళ 2 సార్లు వెళ్లినా ఏం సమస్య లేదు. అలా వెళ్లడం వల్ల ప్రేగులు శుభ్రం అయిపోతాయి. అది అయిపోయాక ఒక గంటసేపు వ్యాయామం చేయండి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు తగ్గాలంటే మందులతో కంటే వ్యాయామంతో త్వరగా కంట్రోల్‌ అవుతుంది. కాబట్టి రోజూ ఒక గంటసేపన్నా వ్యాయామానికి కేటాయించండి. యోగా, ధ్యానం, ఆసనాలు ఏదన్నా...ఆరోగ్యానికి మంచిదే. ఆ తర్వాత మరో లీటర్‌ నీళ్లు ముందు చెప్పిన విధంగా తాగేయండి. అప్పుడు మరోసారి మలం వచ్చినా వెళ్లి వచ్చేయండి. అప్పుడు రోజంతా హాయిగా ఉండొచ్చు.

ఇక ఫ్రెష్‌ అయ్యాక గ్లాసుడు కూరగాయల రసం తాగండి. క్యారెట్‌, బీట్‌రూట్‌, టమోటాలు, కీరా వేసుకోండి. దాంతో పాటే బీర, సొర, పొట్లకాయలు కూడా కాసిన్ని ముక్కలు వేసుకోండి. దాంట్లోకి కాసింత నిమ్మరసం, పుదీనా, తెనే వేసుకుని తాగేస్తే చాలా మంచిది. దాన్ని వడకట్టుకుని తీసుకోవాలి. ఇక ఒక గంట తర్వాత అల్పాహారంగా మొలకలు తీసుకోండి. ఒకవేళ పచ్చిగా తినాలనిపించకపోతే... దాంట్లోకి ఖర్జూర ముక్కలను కోసి వేసుకోండి. పంటికి మధ్యమధ్యలో తియ్యగా అనిపిస్తే వాటిని సులువుగా తినేయొచ్చు. దాంతో పాటే ఏదో ఒక పండు తినాలి. మెడిసిన్‌తో పాటే ఈ అల్పాహారం తిన్నా ఏం కాదు.

Diabetes - India

ఇక దాని తర్వాత మధ్యాహ్నం లంచ్‌ ఒంటిగంటకు చేసేలా చూసుకోవాలి. ఈ అల్పహారానికి, భోజనానికి మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. డయాబెటిక్‌ బాధితులకు తరచూ మూత్రం వస్తూ ఉంటుంది. దానివల్ల త్వరగా డీహైడ్రేట్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లను తాగుతూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవచ్చు. భోజనానికి ఒక రాగిరొట్టే, జొన్నరొట్టె, ఒక పుల్కా గానీ తీసుకోవాలి. 3 ఒకేసారి తీసుకోకుండా ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, నూనె లేని గిన్నెడు తీసుకోవాలి. పక్కనే కాసింత పెరుగు తీసుకోవాలి. ఒకవేళ త్వరగా షుగర్‌ తగ్గాలంటే...ఉడికిన కూరలకు బదులు పచ్చి కూరగాయల సలాడ్‌ను తీసుకోవచ్చు.  అన్నం అసలు తినకూడదు గుర్తుంచుకోండి. భోజనం అయిన వెంటనే ఒక గుక్కెడు నీళ్లు తాగండి. అంతేగానీ ఎక్కువగా తాగకండి. ఒక్క 2 గంటల తర్వాత నీళ్లు హాయిగా తాగొచ్చు.

సాయంత్రం కొబ్బరి నీళ్లు తాగాలి. రాత్రికి మాత్రం ఇంకేమీ తినకుండా పొద్దున్నే నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలి, దాంతోపాటు పండ్లు తినాలి. వైద్యులు సూచించిన మందులతో పాటు ఈ డైట్‌ ఫాలో అయితే....ఎంతటి డయాబెటిక్‌ రోగులైనా త్వరగా బయటపడతారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.