బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు తినండి.. రిజల్ట్‌ పక్కా..!

బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా తినే ఆహారం వల్లనే సాధ్యం అవుతుంది. వ్యాయామాలు ఎన్ని చేసినా మీరు సరైనా ఫుడ్‌ తీసుకోకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈరోజుల్లో గంటల తరబడి కుర్చోనే చేసే జాబ్‌లే ఎక్కువైపోయాయి. దానివల్ల

బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు తినండి.. రిజల్ట్‌ పక్కా..!


బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా తినే ఆహారం వల్లనే సాధ్యం అవుతుంది. వ్యాయామాలు ఎన్ని చేసినా మీరు సరైనా ఫుడ్‌ తీసుకోకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈరోజుల్లో గంటల తరబడి కుర్చోనే చేసే జాబ్‌లే ఎక్కువైపోయాయి. దానివల్ల జంక్‌ఫుడ్స్‌ కాదు కదా ఇంట్లో ఫుడ్‌ తిన్నా బరువు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా బొజ్జ వస్తుంది. వ్యాయామం చేస్తూనే ఇప్పడు చెప్పుకునే ఆహారాలను తీసుకోవడం వల్ల మీరు త్వరగా బరువు తగ్గొచ్చు, కొవ్వు కూడా కరిగించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీ వెయిట్‌ లాస్‌ జర్నీలో వీటిని కూడా జోడించండి.!

బరువు తగ్గాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు..

శెనగలు

ఇవి స్నాక్స్‌ రూపంలో తీసుకుంటే ఫైబర్‌, కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లు, పోటాషియం, మాంగనీస్‌, ఫైబర్‌ వంటవి శరీరాని అందడమే గాక కొవ్వుని ఈజీగా బర్న్‌ చేస్తుంది. 

క్వినోవా

డైట్‌ ప్లాన్‌లో భాగంగా దీన్ని తీసుకుంటే రోజంతా కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోరు. ఇక ఇందులో గ్లూటెన్‌ ఉండదు. గ్లూటెన్‌ పడని వారికి క్వినోవా బెస్ట్‌ ఆప్షన్‌ అని వైద్యులు అంటున్నారు. ఇరిటబుల్‌ బౌల్‌ సిండ్రోమ్‌, సీలియాక్‌ డిసీజ్‌ లాంటి సమస్యలు ఉన్న వారికి క్వినోవా తీసుకోవచ్చు. క్వినోవా తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటిన్‌, ఐరన్‌, ఫైబర్‌, కాల్షియం పుష్కలంగా అందుతుంది. 

బాదం పప్పులు

వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది.

టోఫు:

ఇది తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్ కలిగిన శాఖాహారం. దీనిలో కొలెస్ట్రాల్ కూడా ఉండదు. తద్వారా బరువు ఈజీగా తగ్గొచ్చు. అలాగే ఆడవారి ఆరోగ్యానికి ఇది బాగా మేలు చేస్తుంది. టోఫులోని ఐసోఫ్లేవోన్లు అనే పోషకాలను ఫైటో ఈస్ట్రోజెన్లుగా చెప్తారు. అంటే ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్‌లా పని చేస్తాయి. కాబట్టి నెలసరి క్రమాన్ని సరిచేసే, పీరియడ్స్ మంటను తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి. 

బ్రకోలీ:

దీనిలో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కే, సీ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో సహాయపడతాయి.

మొలకలు

వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెగ్యులర్ వ్యాయామం తోపాటు మొలకలు తీసుకోవడం వల్ల పొత్తికడుపులో ఉండే కొవ్వు తగ్గుతుంది. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.