వంకాయ తింటే గుండెకు చాలా మంచిది తెలుసా..?

నాన్‌వెజ్‌ తినేవాళ్ల కంటే.. కేవలం వెజ్‌ తినేవాళ్లే అందంగా, ఆరోగ్యంగా ఉంటారు తెలుసా..? అసలు నాన్‌వెజ్‌ ఏం ఉంటది. తింటున్నప్పుడు టేస్టీగా గరంగరంగా ఉంటాయి.. వెజ్‌లో వందరకాలు, బోలెడు పోషకాలు, కొవ్వులు ఉండవు

వంకాయ తింటే గుండెకు చాలా మంచిది తెలుసా..?


నాన్‌వెజ్‌ తినేవాళ్ల కంటే.. కేవలం వెజ్‌ తినేవాళ్లే అందంగా, ఆరోగ్యంగా ఉంటారు తెలుసా..? అసలు నాన్‌వెజ్‌ ఏం ఉంటది. తింటున్నప్పుడు టేస్టీగా గరంగరంగా ఉంటాయి.. వెజ్‌లో వందరకాలు, బోలెడు పోషకాలు, కొవ్వులు ఉండవు.. అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. బెండకాయ తింటే మోకాళ్ల నొప్పులు ఉండవు, కరివేపాకు కళ్లకు మంచిది, ఆకుకూరలు అన్నింటికి మంచిదే, దోసకాయ తింటే హైడ్రేట్‌గా ఉండొచ్చు, టమోటా తింటే ఇమ్యునిటీ పవర్‌ పెరుగుతుంది, స్కిన్‌కు మంచిది, దొండకాయ పత్యానికి నెంబర్‌ వన్‌, చిక్కుడుకాయ తింటే ఫైబర్‌, హ్యాపీ హార్మోన్స్‌ రిలీజ్‌ చేస్తుంది.. ఇలా ప్రతి కూరగాయ మనకు ఎన్నో లాభాలను ఇస్తుంది. ఈరోజు మనం వంకాయ తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 
Brinjal Round (Price per 500 gms) – Fast and Fresh Global LLP
వంకాయలో విటమిన్ కె, విటమిన్ సి(Vitamin C), ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు మంచి మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి రోజూ అవసరం. మీరు హార్ట్ పేషెంట్ అయితే వంకాయను కచ్చితంగా తినండి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. గుండె జబ్బులకు ప్రధాన కారణమయ్యేవాటి నుంచి వంకాయ కాపాడుతుంది. ఈ కూరగాయ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని పరిశోధనల్లో కూడా తేలింది.
వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ద్వారా సులభంగా వెళుతుంది. ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో వంకాయను చేర్చుకోవాలి. బరువు తగ్గడం అనేది ప్రధానంగా కేలరీలను తగ్గించడం. ఆహారంలో ఫైబర్ పెంచాలి. వంకాయ మాత్రమే ఈ రెండు పనులు చేయగలదు. వంకాయ తినడం వల్ల బరువు తగ్గడం కూడా తేలిక అవుతుంది. కొవ్వు బర్నింగ్ రేటును మరింత పెంచుతుంది.
ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అది జన్యుశాస్త్రం ద్వారా సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి మీరు వీలైనంత ఎక్కువ వంకాయను తినండి. అనేక పరిశోధనల ప్రకారం క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి వంకాయకు ఉందని తేలింది.
కాబట్టి వంకాయను తినండి. కొంతమంది అంటారు.. వంకాయ తింటే వాతం, దురద అని అది అంతా మీ భ్రమ మాత్రమే. అసలు లేత వంకాయలతో కూర వండితే ఉంటది.. మటన్‌ ఏం సరిపోతుంది..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.