మార్కెట్‌కు వెళ్తే ఎన్నో కూరగాయలు ఉంటాయి. మనం మాత్రం ఎప్పుడూ ఆ వంకాయలు, టమోటాలు, బంగాళదుంపలు, మహా అయితే సొరకాయ, కావాలంటే కాకరకాయ ఇలా రొటీన్‌గా ఉండేవి మాత్రమే తీసుకుంటాం. ఎప్పుడైనా ఆ క్యాప్సికమ్ వైపు చూశారా..? క్యాప్సికమ్ తింటే ఆరోగ్యానికి చాలా మంచింది. కొంతమంది గ్రీన్ క్యాప్సికమ్ తింటుంటారు. అసలు విషయం రెడ్ క్యాప్సికమ్‌లోనే ఉంది. ఇది మీ ఆరోగ్యాన్ని ఎంతలా కాపాడుతుందంటే.. మీరు అసలు ఊహించలేరు. దీని కాస్ట్ కాస్త ఎక్కువే.. అయితేనేం బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ కదా. ! అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు రెడ్ క్యాప్సికమ్‌లో దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను మనం ఎందుకు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.. దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్ ఎ, బీటా కెరోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఎరుపు రంగు క్యాప్సికంను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శరీరంలో జీవక్రియల రేటును పెంచి అధిక క్యాలరీలు ఖర్చయేలా చేయడంలో ఎరుపు రంగు క్యాప్సికం మనకు దోహదపడుతుంది.
ఎరుపు రంగు క్యాప్సికంను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది.
దీనిలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా ఎరుపు రంగు క్యాప్సికంను తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండాఉంటాము.
ఈరోజుల్లో మహిళలు చాలా మందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్నారు. దీని ప్రభావం పిరియడ్స్ పై పడుతుంది. బ్లీడింగ్ తక్కువగా అవుతుంది. ఇలాంటి సమస్యలు ఉంటే.. ఎరుపు రంగు క్యాప్సికమ్‌ను మీ డైట్‌లో జోడించండి.