Heart Attack : ఈరోజుల్లో గుండెజబ్బులు ఏంటో.. జ్వరం వచ్చినట్లు వచ్చేస్తున్నాయి. పిట్టల్లా రాలిపోతున్నారు. అసలు ఎందుకు వస్తున్నాయో, ఎవరికి వస్తున్నాయో తెలియకుండా అందరూ గుండెజబ్బుల భారిన పడి చనిపోతున్నారు. అయితే హార్ట్‌ఎటాక్‌ల ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది అనే విషయానికి వస్తే.. దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.. అలాంటి వాటిల్లో చేతి వేళ్లు కూడా ఒకటి..
హైబీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉండడం, అధిక బరువు, పొగ తాగడం, మద్యం సేవించడం, ఒత్తిడి.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ వచ్చేందుకు కొద్ది రోజుల ముందే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ముందుగానే చికిత్స తీసుకోవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఛాతిలో పట్టేసినట్లు ఉండడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఛాతిలో సూదులతో గుచ్చినట్లు ఉండడం, ఛాతి మీద బరువు పెట్టినట్లు అనిపించడం.. ఎడమ వైపు దవడ, మెడ, భుజం, చేయి నొప్పిగా ఉండడం.. చిన్న పని చేసినా విపరీతమైన అలసట, ఆయాసం రావడం, అసలు ఏమాత్రం పనిచేయలేకపోవడం, చెమటలు ఎక్కువగా పట్టడం.. ఇవన్నీ..గుండె పోటు వచ్చేముందు కనిపించే సంకేతాలే. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే
గుండె పోటు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
చేతివేళ్ల సైజ్‌ను బట్టి...
ఇక చేతి వేళ్ల సైజ్‌ను బట్టి కూడా గుండె జబ్బులు వస్తాయో, రావో చెప్పేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 200 మంది పురుషులను కొందరు సైంటిస్టులు పరిశీలించారు. ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు పొడవు ఎక్కువగా ఉంటే అలాంటి వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం వరకు ఎక్కువగా ఉంటాయట. సాధారణంగా అందరికీ చేతి వేళ్లలో మధ్య వేలు పొడవుగా ఉంటుంది. దాని తరువాత ఉంగరం వేలు, ఆ తరువాత చూపుడు వేలు పొడవుగా ఉంటాయి. కానీ కొందరిలో మధ్య వేలు, ఉంగరం వేలు, చూపుడు వేలు.. ఈ మూడు వేళ్లూ సమానంగా ఉంటాయి. అలాగే ఇంకొందరికి ఉంగరం వేలి కన్నా చూపుడు వేలు పొడవుగా ఉంటుంది. ఇలా రెండు రకాలుగా వేళ్ల పొడవు ఉన్న వారికి
గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. వీరిలో 35 నుంచి 85 ఏళ్ల మధ్య ఉన్న వారికి రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుందట..