అర్ధచక్రాసనం: వెన్నుముకను ధృడంగా చేసే అద్భుతమైన ఆసనం

యోగా అనేది కేవలం డైలీ చేసే ఒక వ్యాయామం మాత్రమే కాదు.. ఇది అలవాటుగా చేసుకుంటే మీకు మీరే కొత్తగా అనిపిస్తారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఒక ఆసనం మొదటి రోజు వేయడం కష్టంగా ఉంటుంది, ప్రాక్టీస్‌ చేసే కొద్ది ఒకరోజుకు మీరు సులభంగా వేయగలుగుతారు,

అర్ధచక్రాసనం: వెన్నుముకను ధృడంగా చేసే అద్భుతమైన ఆసనం


యోగా అనేది కేవలం డైలీ చేసే ఒక వ్యాయామం మాత్రమే కాదు.. ఇది అలవాటుగా చేసుకుంటే మీకు మీరే కొత్తగా అనిపిస్తారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఒక ఆసనం మొదటి రోజు వేయడం కష్టంగా ఉంటుంది, ప్రాక్టీస్‌ చేసే కొద్ది ఒకరోజుకు మీరు సులభంగా వేయగలుగుతారు, అప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. మీరు ఏదైనా చేయగలరు అనే నమ్మకాన్ని యోగా ఇస్తుంది. మానసిక ప్రశాంత కావాల్సినంత దొరుకుతుంది. యోగాలో వెన్నుముకను ధృడంగా చేసే ఆసనాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి అర్ధచక్రాసనం. ఈరోజు మనం ఈ ఆసనం గురించి తెలుసుకుందాం.!
Ardha Chakrasana Benefits, Precautions, Ardha Chakrasana Steps

అర్ధచక్రాసనం ఎలా వేయాలంటే..

మెుదటగా రెండు కాళ్లు కలిపి నిటారుగు నిలబడాలి. 
రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. 
గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. 
అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. 
నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. 
చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 
ఇలా 8 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకూ చేయాలి

అర్ధ చక్రాసనం వల్ల ఉపయోగాలు:

ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 
నడుము నొప్పి, థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు ఈ ఆసనం మంచి ఫలితాలను ఇస్తుంది. 
వెన్నముక పనితీరుని మెరుగు పరుస్తుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. 
ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది.
సూచన : ఈ ఆసనాన్ని తీవ్రమైన హిప్ లేదా వెన్నెముక సమస్యలు ఉన్నవారు వేయకూడదు. అంతేకాదు అధిక రక్తపోటు , మెదడు రుగ్మతలున్నవారు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలి. అల్సర్, హెర్నియా రోగులు ఈ యోగాసనాన్నీ వేయరాదు. ఇక గర్భిణీ స్త్రీలు కూడా అర్ధ చక్రాసనానికి దూరంగా ఉండాలి. చేతులు, మణికట్టు, భుజం, మెడ, వీపు, లేదా తుంటికి ఇటీవల లేదా దీర్ఘకాలికంగా గాయపడిన వ్యక్తులు కూడా ఈ ఆసనం వేయకూడదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.