షుగర్ పేషంట్స్ కు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇదే..!

ఒకసారి షుగర్ వస్తే లైఫ్ అంతా ఈ వ్యాధితో బాధపడాల్సిందే. ఏదో ఒక రకంగా ప్రతి విషయాన్ని ప్రభావితం చేస్తుంది. ఏం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయితే షుగర్ పేషెంట్లు ఎంతో హెల్తీగా టేస్టీగా

షుగర్ పేషంట్స్ కు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇదే..!


ఒకసారి షుగర్ వస్తే లైఫ్ అంతా ఈ వ్యాధితో బాధపడాల్సిందే. ఏదో ఒక రకంగా ప్రతి విషయాన్ని ప్రభావితం చేస్తుంది. ఏం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయితే షుగర్ పేషెంట్లు ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే కొన్ని రకాల బ్రేక్ ఫాస్ట్ ఎలాంటి అభ్యంతరం లేకుండా తినేయొచ్చు అవి ఏంటంటే..

క్వినోవా దోస..

క్వినోవా.. షుగర్ పేషెంట్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది. మినప్పప్పు, క్వినోవా, తృణధాన్యాలు కలిపి చేసిన దోసెను డయాబెటిక్ పేషెంట్లకు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా ఇవ్వడం వల్ల శరీరాన్ని కావలసిన పోషకాలు అందడంతో పాటు టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రోజున ఉల్లాసంగా మారుస్తుంది.

వెజిటేబుల్ ఇడ్లీ..

ఇడ్లీ ను తయారు చేసే సమయంలో ఆ పిండిలో హెల్దీ వెజిటేబుల్స్ ఉపయోగించడం వల్ల ఎంతో టేస్టీగా మారుతుంది. ఆకుకూరలు, కాయగూరలు వంటివి కూడా వాడుకోవచ్చు. క్యారెట్, పాలకూర వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పన్నీర్ రోటి..

షుగర్ పేషెంట్స్ పన్నీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు. అయితే పన్నీర్ తో చేసిన రోటీ ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. దీన్నే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల శరీరాన్ని కావాల్సిన పోషకాలు అందుతాయి.

వెజిటేబుల్ ఓట్స్..

తినటానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఇష్టంగా తింటే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెడీ అవుతుంది. అయితే ఈ ఓట్స్ లో వెజిటేబుల్స్ కలిపి ఇవ్వడం వల్ల ఏ వయసు మరేనా ఎలాంటి ఇబ్బంది లేకుండా లాగించేస్తారు..

వెజిటేబుల్ ఊతప్ప..

ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ ఒక భాగం అయిపోయిన ఊతప్ప ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. దీనిలో కొంచెం వెజిటేబుల్స్ కలిపి చేయడం వల్ల చూడటానికి కలర్ఫుల్ గా అనిపించడమే కాకుండా హెల్త్ కి కూడా ఎంతో మంచిది..

కుట్టు పిండి దోస..

ఈ కుట్టు పిండిలో గ్లైసమిన్ తక్కువగా ఉంటుంది. దీంతో దోశలు తయారుచేసి డయాబెటిక్ పేషెంట్స్ కి ఇవ్వడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి..

ఓట్ మిల్..

చక్కెర వ్యాధి ఉన్నవారికి ఓట్ మిల్ ఎంతో హెల్తీ అని చెప్పాలి. దీనిని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.