పెళ్లై రెండు మూడేళ్లు అయినా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఇవే..!

కొన్ని ఏళ్ల క్రితం కావాలని పిల్లలు అప్పుడే వద్దునుకోని అలా ప్లాన్‌ చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు పిల్లలు పుట్టాలని ఎంత ట్రై చేసినా దంపతులుకు ఆ భాగ్యం కలగడం లేదు. పెళ్లై రెండు మూడు ఏళ్లు అయినా చాలా మంది సంతానం కోసం ఎదురుచూస్తున్నారు.

పెళ్లై రెండు మూడేళ్లు అయినా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఇవే..!


కొన్ని ఏళ్ల క్రితం కావాలని పిల్లలు అప్పుడే వద్దునుకోని అలా ప్లాన్‌ చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు పిల్లలు పుట్టాలని ఎంత ట్రై చేసినా దంపతులుకు ఆ భాగ్యం కలగడం లేదు. పెళ్లై రెండు మూడు ఏళ్లు అయినా చాలా మంది సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సమస్యకు కొన్ని కామన్‌ కారణాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా.!
Pregnancy food tips, follow this month-wise diet guide to ensure baby's  health | Health - Hindustan Times
ఈ సమస్యకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే, ఒకవైపు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పు, ఆలస్యంగా వివాహం లేదా పిల్లలను ఆలస్యంగా ప్లాన్ చేయడం, ఈ కారణాల వల్ల కొందరికి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ.  
శరీరంలో ఊబకాయం పెరిగితే ప్రమాదమే. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కావడమే కాకుండా, దంపతుల్లో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశాలను కూడా పెంచుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే మొదటి నుంచి బరువు పెరగకుండా జాగ్రత్త పడండి. 
 
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా వంధ్యత్వానికి ప్రధాన కారణం అవుతోంది. ప్రధానంగా ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా, లైంగిక సమస్యలు జంటలలో వంధ్యత్వ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకోండి. దేన్ని మరీ అంత సీరియస్‌గా తీసుకోకండి. జాబ్‌ను జాబ్‌లానే ట్రీట్‌ చేయండి. మొత్తం మీ భుజాల మీద వేసుకుని ఒంటెద్దు చాకిరీ చేయకండి. ఎండ్‌ ఆఫ్‌దీ డేకు మీకు కేవలం అందులో పనిచేసే ఒక ఉద్యోగి మాత్రమే కంపెనీ మిమ్మల్ని అంత వరకే చూస్తుంది.
5 Teas That Cause Miscarriage During Pregnancy & 6 Best Teas To Enjoy
 
ఇక పెళ్లయ్యాక చాలా మంది వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పట్లో పిల్లలు వద్దు అంటూ పిల్లల్ని కనాలనే ఆలోచనతో వాయిదా వేస్తారు. కానీ రానురాను వయస్సు పెరిగే కొద్దీ వారిద్దరిలో సంతానోత్పత్తి క్షీణతతో కూడా ఈ సమస్య కనిపిస్తుంది.
 
సిగరెట్లు, మద్యం ఈ రెండింటి గురించి తెలిసినప్పటికీ, చాలా మంది వీటికి బానిసలుగా మారిపోతున్నారు. ఇలాంటి చెడు అలవాట్ల వల్ల దంపతుల్లో సంతానలేమి సమస్య పెరుగుతోంది.
 
అతిగా కాఫీ తాగడం వల్ల కూడా సంతాన లేమి సమస్య వస్తుందంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కాఫీని మితంగా తీసుకోవాలి. కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పురుషుల స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. మహిళల్లో గుడ్ల నాణ్యత తగ్గుతుంది.
 
మధుమేహ వ్యాధిని సైలెంట్ కిల్లర్ డిసీజ్ అని పిలుస్తారు. దంపతుల్లో వంధ్యత్వానికి ఇది కూడా కారణమవుతుంది. మధుమేహ వ్యాధిని నియంత్రించకపోతే, అలాంటి వారికి పిల్లలు పుట్టడంలో సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
వీటిల్లో మీకు ఏ సమస్య ఉన్నా ముందు అవి సరిచేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఫలితం ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.