కిడ్నీల ఆరోగ్యంగా ఉండాలంటే..వీటిని రోజూ తీసుకోవాలి..

మానవ శరీరంలో ప్రతి పార్ట్ చాలా ముఖ్యమైనదే.. ఏ ఒక్క పార్ట్ పని చేయకున్న ఏదొక అనారోగ్య సమస్యలు వస్తాయి.. అనేక రకాల వ్యాధులతో పోరాడాలి..కిడ్నీల విషయానికొస్తే..శరీర తీరును బట్టి కిడ్నీల ఆరోగ్యం

కిడ్నీల ఆరోగ్యంగా ఉండాలంటే..వీటిని రోజూ తీసుకోవాలి..


మానవ శరీరంలో ప్రతి పార్ట్ చాలా ముఖ్యమైనదే.. ఏ ఒక్క పార్ట్ పని చేయకున్న ఏదొక అనారోగ్య సమస్యలు వస్తాయి.. అనేక రకాల వ్యాధులతో పోరాడాలి..కిడ్నీల విషయానికొస్తే..శరీర తీరును బట్టి కిడ్నీల ఆరోగ్యం కూడా ఉంటుంది..వాటికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.. శరీరానికి పోషకాలు అందించి విషతుల్యాలను బయటకు పంపేసే అవయవాలు కిడ్నీలు. రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి. అలాంటి కిడ్నీలను బంగారంలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడాలంటే ఎటువంటి ఆహారపదార్థలను రోజూ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Renal Diet for Kidney Health: All You Need to Know - HealthKart
వెల్లుల్లి..
వెల్లులితో శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు పంపేందుకు వెల్లులి తోడ్పడుతుంది. వీటిని పచ్చిగా లేదంటే వంటల్లో వేసుకుని తిన్నా మంచి ఫలితం ఉంటుంది.
యాపిల్..
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో అస్సలు పనిలేదని నిపుణులు అంటున్నారు..ఆపిల్ తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించవచ్చు. ఆపిల్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బు, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడానికి, డయాబెటిస్ నియంత్రణకు ఇవి ఉపకరిస్తాయి. డయాబెటిస్ వల్ల కిడ్నీలకు ముప్పు ఎక్కువ. కాబట్టి ఆపిల్ పండ్లను తినడం వల్ల కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చు..
లావు మిర్చీ..
లావుగా ఉండే ఎర్రటి మిర్చీలో విటమిన్-A, విటమిన్-C ఉంటాయి. ఇవి ఆక్సిడెంట్లలా పని చేస్తాయి. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. దీని వల్ల కిడ్నీలకు మేలు జరుగుతుంది. తగిన మోతాదులో వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. అయితే, ఇవి మార్కెట్లో అరుదుగా లభిస్తాయి..
స్ట్రాబెర్రీలు..
వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే మాంగనీస్, పొటాషియం కిడ్నీలు మెరుగ్గా పని చేసేందుకు సహకరిస్తాయి.
ఓట్స్..
 ఓట్స్‌లో పీచు పదార్థాలు ఎక్కువ. ఇందులో ‘బీటా గ్లూకాన్’ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని తీసుకోవడం చాలా మంచిది.
నీరు..
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంలే రోజు క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. నీరు శరీరాన్ని డీహైడ్రేషన్‌కు కాకుండా రక్షిస్తుంది. రోజూ 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు హాని కలిగించే విషతుల్య పదార్థాలు శరీరం నుంచి తేలిగ్గా బయటకు వెళ్లిపోతాయి..
ఉల్లిపాయలు..
ఉల్లిపాయలు బీపీని తగ్గిస్తాయి. మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీలపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు..
పుట్టగొడుగులు..
పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్-B, విటమిన్-D కిడ్నీ జబ్బులను దూరం చేస్తాయి. రకరకాల పుట్టగొడుగుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి..
క్లాలిప్లవర్..
కాలిఫ్లవర్‌లో విటమిన్ K, విటమిన్ C, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. కాలిఫ్లవర్‌లో ఉండే సల్ఫర్, పొటాషియం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేస్తాయి. ఫలితంగా కిడ్నీల పని తీరు మెరుగవుతుంది...
వీటిని రోజూ మీ ఆహారంలో చేర్చుకుంటే మీ కిడ్నీల సమస్యలు దూరం అవుతాయి.. ఇక కిడ్నీల సమస్యలు అస్సలు రావు..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.