దీర్ఘకాలికంగా.. వంశపారపర్యంగా వేధించే వ్యాధులు రాకుండా అడ్డుకొని విటమిన్ ఏంటో తెలుసా.. రోజు ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే!

ఆహారం ద్వారా దొరికే విట‌మిన్లు శరీరంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. ర‌క‌ర‌కాల ప్ర‌యోజ‌నాల్ని అందిస్తాయి.   వీట‌న్నింటిలో విట‌మిన్ - సి చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఎందుకంటే  ఇది క‌ణాల అభివృద్ధి, ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుదులకు..

దీర్ఘకాలికంగా.. వంశపారపర్యంగా వేధించే వ్యాధులు రాకుండా అడ్డుకొని విటమిన్ ఏంటో తెలుసా.. రోజు ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే!


ఆహారం ద్వారా దొరికే విట‌మిన్లు శరీరంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. ర‌క‌ర‌కాల ప్ర‌యోజ‌నాల్ని అందిస్తాయి.   వీట‌న్నింటిలో విట‌మిన్ - సి చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఎందుకంటే  ఇది క‌ణాల అభివృద్ధి, ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుదులకు, స‌హాయ‌ప‌డ‌టంతో పాటు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పెంచుతుంది. మ‌రి ఇంత‌టి ప్రాముఖ్యం క‌లిగిన దీని వ‌ల్ల క‌లిగే 5 ప్ర‌ధాన ప్ర‌యోజ‌నాల గురించి  తెలుసుకుందాం..

నిమ్మ‌జాతి పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఈ  పండ్ల‌లో తక్కువ క్యాల‌రీలు, జీరో కొలెస్ట్రాల్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా శరీరంలో ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూర్తాయి. నిమ్మ‌కాయ‌, ఆరెంజ్, పైనాపిల్‌, స్ట్రాబెర్రీ, కివీ ఫ్రూట్స్, బ్ర‌కోలి, పాల‌కూర వంటి వాటిల్లో ఇది అధికంగా ల‌భిస్తుంది.

సి విటమిన్తో ప్రయోజనాలు..

దీర్ఘ‌కాలిక వ్యాధులన్నీ దూరం.. 

విట‌మిన్ సి తీసుకోవ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలిక వ్యాధులు బారిన పడే అవకాశం ఉండదు. ఇది ప్రొటీన్ యాంటీ యాక్సిడెంట్​గా పని చేస్తుంది. ఇది  వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరగడంలో సాయ‌ప‌డుతుంది.  హాని క‌లిగించే విధ్వంస‌క ఫ్రీ రాడిక‌ల్ కెమికల్స్ నుంచి ర‌క్ష‌ణ క‌ణాల‌ను కాపాడుతుంది. శరీరానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది.

గుండెజబ్బుల ముప్పు త‌గ్గిస్తుంది..  

ప్ర‌పంచంలో అధిక శాతం మంది  గుండె జ‌బ్బులతోనే మరణిస్తున్నారు. బీపీ, చెడు కొలెస్ట్రాల్ లాంటి వాటి వ‌ల్ల ఇవి వ‌స్తాయి. విట‌మిన్ 'సి'కి దీన్ని  త‌గ్గించే సామ‌ర్థ్య‌ముంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది.

అధిక ర‌క్త‌పోటును త‌గ్గించ‌డంలో ప్రముఖ పాత్ర..

ఈ రోజుల్లో ఎక్కువమంది అధిక బీపీతో బాధ‌ప‌డుతున్నారు.  కాగా విట‌మిన్ సి అధిక ర‌క్త‌పోటును త‌గ్గిస్తుంది. అది ర‌క్త  నాలాలను అదుపులో ఉంచుతుంది. దీని వ‌ల్ల ర‌క్త‌పోటు స్థాయులు త‌గ్గుతాయి.

గాయాలు మానడంలో ముందుంటుంది..

గాయాన్ని వేగంగా న‌యం చేయ‌డంలో తోడ్ప‌డుతుంది.  ఇంకా మ‌నం తినే ఆహారంలో సిట్ర‌స్ పండ్లు ఉండేలా చూసుకోవ‌డం వ‌ల్ల ఆస్త‌మా లాంటి దీర్ఘ‌కాలిక వ్యాధిని నివారించుకోవచ్చు. 

క్యాన్సర్ నుంచి రక్షణ.. 

క్యాన్స‌ర్ సెల్స్ నివార‌ణలో విట‌మిన్ సి కీల‌క పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చ‌ర్మ‌, రొమ్ము క్యాన్సర్లను నివారిస్తుంది.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ పదిలం..

శరీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ పెర‌గ‌డంలో విట‌మిన్ సి ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడే లింఫోసైట్స్, ఫాగోసైట్స్ వంటి తెల్ల‌ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తిని పెంచుతుంది. వాటి ప‌నితీరునూ మెరుగు ప‌రుస్తుంది. చ‌ర్మ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థకు ఇది చాలా అవ‌స‌రం. యాంటీ ఆక్సిడెంట్​గానూ ఇది ప‌నిచేస్తుందట.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.