చర్మం, కళ్లు చూసి కిడ్నీల‌ ప‌నితీరు అంచనా వేయొచ్చని తెలుసా!

మన శరీరంలో ఏదైనా అవయవ పనితీరులో మార్పు వచ్చినప్పుడే దాని ప్రాముఖ్యతను తెలుస్తుంది. అప్పటి వరకు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు..

చర్మం, కళ్లు చూసి  కిడ్నీల‌ ప‌నితీరు  అంచనా వేయొచ్చని తెలుసా!
Chronic kidney disease


మన శరీరంలో ఏదైనా అవయవ పనితీరులో మార్పు వచ్చినప్పుడే దాని ప్రాముఖ్యతను తెలుస్తుంది. అప్పటి వరకు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు.. పరిస్థితులు చేతులు దాటిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. కానీ.. ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ముందు... కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. 
అలా మన శరీరంలో ముఖ్యమైన మూత్రపిండాల పని తీరును ఓ కంట కనిపెట్టాలి అంటున్నారు వైద్యులు. శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు, అదనపు ద్రవాలను కిడ్నీలు తొలగిస్తాయి. కిడ్నీలో ఎలాంటి సమస్య వచ్చినా అనేక రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే మూత్రపిండాల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు కిడ్నీ ఫెయిల్యూర్‌కు సంకేతాలుగా కనిపిస్తాయి. అయితే కళ్ళు, చర్మం సహాయంతో మీరు కిడ్నీల పరిస్థితిని తెలుసుకోవచ్చు. 

చర్మ సమస్యలు:

కిడ్నీ సరిగా పనిచేయకపోతే చర్మం పొడిబారడం, పొట్టు, దురద వంటి సమస్యలు రావచ్చు. నిజానికి కిడ్నీలు మన రక్తంలోని వ్యర్ధాలను వడపోసి శుద్ది చేసిన రక్తాన్ని తిరిగి శరీరానికి పంపుతాయి. ఇది సరిగ్గా పని చేయకపోతే, వివిధ చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 

కంటి సమస్యలు:

కిడ్నీలో ఎలాంటి సమస్య వచ్చినా కంటి సమస్యలు కూడా వస్తాయి. మీ కళ్ల చుట్టూ వాపు వచ్చినట్లు అనిపించినా.. కంటి చూపు స్పష్టంగా లేకపోయినా..? అటువంటి పరిస్థితిలో, మీ కిడ్నీలను పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.