ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పోషకాలు లోపిస్తే పుట్టే బిడ్డ మానసిక ఎదుగుదలపై ప్రభావం తప్పనిసరి..!

ప్రెగ్నెన్సీ సమయంలో పోషకాహార లోపం తప్పనిసరి. ముఖ్యంగా ఈ సమయంలో విటమిన్స్, మినరల్స్ తక్కువగా ఉంటాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పోషకాలు లోపిస్తే పుట్టే బిడ్డ మానసిక ఎదుగుదలపై ప్రభావం తప్పనిసరి..!
Nutritional deficiency in pregnant


ప్రెగ్నెన్సీ సమయంలో పోషకాహార లోపం తప్పనిసరి. ముఖ్యంగా ఈ సమయంలో విటమిన్స్, మినరల్స్ తక్కువగా ఉంటాయి. వీటితోపాటు ఐరన్ కూడా శరీరంలో తగ్గిపోతుంది. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే పుట్టే బిడ్డకు పెను ప్రమాదం తప్పనిసరి. అందులో ముఖ్యంగా ఎక్కువ మంది ఏ విషయంలో ఇబ్బంది పడతారో ఒకసారి తెలుసుకుందాం.

ఐరన్..

ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ లోపం చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపం కారణంగా అలసట, నిద్ర లేకపోవడం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా నెలలు ఉండకుండా పుట్టే పిల్లలు సైతం రక్తహీనత కారణంగానే ఇబ్బంది పడుతూ ఉంటారు.

విటమిన్ డి లోపం..

చాలామందిలో ఈ సమస్య కనిపించినప్పటికీ ప్రెగ్నెన్సీ సమయంలో ఇది పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా పుట్టే బిడ్డ ఎముకలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఫోలిక్ యాసిడ్ లోపం..

ప్రెగ్నెన్సీ సమయంలో వైద్యులు పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోమని సూచిస్తూ ఉంటారు. వీటి లోపం కారణంగా మెదడు, వెన్నపాము సంబంధించిన లోపాలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యలు ఎదురయ్యే పుట్టే బిడ్డ ఇబ్బందులు ఎదుర్కొంటారు..

అయోడిన్ లోపం..

ప్రెగ్నెన్సీలో అయోడిన్ లోపం ఉంటే థైరాయిడ్ హార్మోన్ పై ప్రభావం పడుతుంది. దీని కారణంగానే నెలలు నిండకుండానే ఇంకా గర్భస్రావం జరగటం, పుట్టే బిడ్డ మానసిక ఎదుగుదలపై ప్రభావం పడటం అంటే లక్షణాలు కనిపిస్తాయి.

విటమిన్ బి 12 జింక్..

వీటిలో లోపం వల్ల నెలలు నిండకుండా బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి గర్భస్రావం కూడా జరుగుతుంది. బిడ్డ ఎదుగుదలలో సమస్యలు తలెత్తుతాయి.

విటమిన్ సి లోపం..

ఈ లోపం వలన శిశువు పుట్టిన తర్వాత సైతం పలు రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది.. అంతేకాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, తరచూ ఏవో ఒక రకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవటం వంటివి జరుగుతూ ఉంటాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.