నెలలు నిండుతుంటే నిద్ర రావడం లేదా.. గర్భిణీలు ఏం చేయాలంటే.. !

గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రతిక్షణం ఎన్ని సవాళ్లు ఎదురైనా పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది అమ్మ. అయితే Sleeping While Pregnant లో ఆటంకాలు ఎదురవుతాయి

నెలలు నిండుతుంటే నిద్ర రావడం లేదా.. గర్భిణీలు ఏం చేయాలంటే.. !


గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రతిక్షణం ఎన్ని సవాళ్లు ఎదురైనా పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది అమ్మ. అయితే Sleeping While Pregnant లో ఆటంకాలు ఎదురవుతాయి. వీటిని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తేలికగా అధికమించవచ్చని చెబుతున్నారు నిపుణులు..

గర్భిణీకి నెలలు నిండుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా కాళ్లు, చేతులు వాపులకు గురవుతాయి. అలాగే వెన్నెముక నొప్పి పుడుతుంది. అలాగే కొన్నిసార్లు ఏం తిన్నా వాంతులు అయిపోతూ ఉంటాయి. తిన్నది అరగక నీరసంగా అనిపిస్తుంది. వీటికి తోడు రోజు వేసుకునే మందులతో కాస్త చిరాకు గానే అనిపిస్తుంది. అయితే వీటన్నింటినీ పక్కనపెట్టి తగినంత సమయం నిద్రపు కేటాయిస్తేనే తల్లి బిడ్డకు మంచిదని తెలుస్తోంది. మరి నిద్ర పట్టకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు..

ముందుగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయానికి కంగారు పడటం, డెలివరీ కోసం అతిగా ఆలోచించడం చేయకూడదు. దీని వలన ఒత్తిడి పెరుగుతుంది.. అలాగే నిద్రపోయే సమయంలో పక్కన ఎవరో ఒకరు ఉండే విధంగా చూసుకోవాలి. వీలైతే ఈ సమయంలో భర్త తోడు చాలా అవసరం.. భర్త అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి..

5 Common mistakes Woman make during Pregnancy - Theayurveda

మనసుకు నచ్చిన పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్రకి గంట ముందు ఫోన్, లాప్టాప్ వాటిని దూరంగా ఉంచాలి.. అలాగే రాత్రి భోజనం అనంతరం కాసేపు నడవాలి దీని వలన ప్రశాంతంగా నిద్ర పడుతుంది..

గర్భిణీ స్త్రీలు నిపుణుల పర్యవేక్షణలో తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. దీని వలన శారీరక అలసట కలిగి మంచి నిద్ర వస్తుంది.. అలాగే తల కింద కాళ్ళ కింద వీలైనంత ఎత్తును ఉంచుకోవడం వల్ల సౌకర్యంగా అనిపిస్తుంది.. 

అలాగే వెల్లకిలా నిద్రపోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అయితే దీని వలన కడుపులో ఉన్న బిడ్డకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా ఉండదు. అంతేకాకుండా వెన్నెముక పైన భారం పడే అవకాశం ఉంది. అందుకే ఒక వైపుకు తిరిగి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.