Navara rice : ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేని వారికి కూడా సంతాన భాగ్యం కలిగించే ఈ బియ్యం కోసం మీకు తెలుసా..!

Navara rice : దాదాపు మూడు దశాబ్దాల క్రితం మొదలైన హరిత విప్లవం ఆహార రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది..  ఆ రోజుల్లో తినడానికి తిండి లేక సంకరజాతి వంగడాలను

Navara rice : ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేని వారికి కూడా సంతాన భాగ్యం కలిగించే ఈ బియ్యం కోసం మీకు తెలుసా..!


Navara rice : దాదాపు మూడు దశాబ్దాల క్రితం మొదలైన హరిత విప్లవం ఆహార రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది..  ఆ రోజుల్లో తినడానికి తిండి లేక సంకరజాతి వంగడాలను అభివృద్ధి చేశారు. అప్పటికి అయితే కొరత తీరింది కానీ..  తర్వాత వచ్చే ఎన్నో సమస్యలకు కారణమైంది. హరిత విప్లవంతో దేశీయ విత్తనాలు అనేవి పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇప్పుడు పండిస్తున్న పంటల రసాయనాల ప్రభావం మనుషుల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. వీటిలో సంతానం లేకపోవడం కూడా ఒకటి. అయితే ఇందుకు చక్కని పరిష్కారం దేశీయ విత్తనాలతో పండించిన ఆహారాన్ని తీసుకోవటమే.

నిజానికి నేటి రోజుల్లో చాలామందికి దేశీ విత్తనాల గురించి తెలియదు. 1990 కి ముందు భారతదేశంలో దేశీయ విత్తనాల సాగు జరిగేది.. తర్వాత వ్యవసాయ రంగంలోకి వచ్చినవే ఇప్పుడు అందరూ తింటున్న కొత్త రకం వరి వంగడాలు. అయితే ఇప్పటికీ కొన్నిచోట్ల దేశీ విత్తనాల సాగు జరుగుతుంది. వీటికి ఎలాంటి రసాయనాలు వాడవలసిన అవసరం లేదు.

ప్రకృతి సిద్ధంగా పండించే ఈ వరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కొన్ని రకాలు.. కులాకర్, నారాయణ కామిని, రత్న చోడి, మైసూర్‌ మల్లిక, ఇల్లపు సాయి, నవారా, కాలాబట్టి.. అయితే దేశీయ వరి అయిన నవారా రైస్ లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 

ఎవరైతే గర్భం దాల్చాలి అనుకుంటున్నారో.. ఆ స్త్రీలు వీటిని తీసుకుంటే వాళ్లలో ఉన్న అన్ని సమస్యలు తగ్గి గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పిల్లలు కావాలి అనుకునే వారిలో మగవారిలో లోపం ఉంటే వాళ్ళు కులాకర్ రైస్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నేటి రోజుల్లో ఇవి విరివిరిగా దొరుకుతున్నాయి.. వీటి ధర సుమారు కేజీ 100 నుంచి 150 మధ్యలో ఉంటుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తప్పకుండా ఫలితాలు ఉంటాయని ఎందరో విశ్వసిస్తున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.