ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే ముందు ఈ మార్పులు చేయండి..!

ఈరోజుల్లో.. పిల్లలు పుట్టేందుతు.. చాలా జంటలు నానా తంటాలు పడుతున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు.. భార్య, భర్తలు ఇద్దరిలో లోపాలు ఉంటున్నాయి.. రోజువారి ఆహారపు అలవాట్లే ఈ సమస్య

ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే ముందు ఈ మార్పులు చేయండి..!


ఈరోజుల్లో.. పిల్లలు పుట్టేందుతు.. చాలా జంటలు నానా తంటాలు పడుతున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు.. భార్య, భర్తలు ఇద్దరిలో లోపాలు ఉంటున్నాయి.. రోజువారి ఆహారపు అలవాట్లే ఈ సమస్యను ప్రధాన కారణం.. కాబట్టి.. ఎప్పుడో పెళ్లైన తర్వాత కదా ఇప్పుడు ఎందుకులే అని కాకుండా.. మీరు ఇప్పటి నుంచే మంచి ఆహారం తినండి.. అలాగే పెళ్లైన వారు కూడా.. మీ ఫుడ్‌మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి.. ఏ ఆహారాలు తింటే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుందో నిపుణులు చెప్తున్నారు.. అవి ఏంటంటే..
జీవనశైలి అలవాట్లతో సహా సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉంటాయి. మీ నియంత్రణలో ఉండే.. అలవాట్లను తగ్గించి.. గర్భం దాల్చేందుకు ప్రయత్నించండి. ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూసే వాళ్లు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా.. కావట్లేదని బాధపడుతుంటారు.

పొగాకు వినియోగం ప్రెగ్నెన్సీ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ధూమపానంతో మీ అండాశయాల మీద చాల ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్స్ మీద ఈ ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని నిపుణులు చెబుతారు. ధూమపానం చేస్తుంటే దానిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.. వీలైతే మానేయండి.
అధికంగా మద్యపానం అండోత్సర్గము రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భం దాల్చాలంటే.. మద్యపానాన్ని పూర్తిగా తగ్గించాలి.. గర్భధారణ సమయంలో అతిగా మద్యం తాగితే.. మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అంతేకాదు.. పిండానికి కూడా ప్రమాదం.
రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల స్త్రీల సంతానోత్పత్తి ప్రభావితం చూపుతుంది.. కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి. టీ, కాఫీలను పరిమితం చేయండి.
అతిగా వ్యాయామం చేయడం పట్ల జాగ్రత్త వహించండి. చాలా తీవ్రమైన శారీరక శ్రమ అండోత్సర్గాన్ని నిరోధిస్తుంది. ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మీరు మంచి బరువు కలిగి ఉంటే.. గర్భవతి కావాలని ఆలోచిస్తున్నట్లయితే, తీవ్రమైన శారీరక శ్రమను వారానికి ఐదు గంటల కంటే తక్కువకు పరిమితం చేయండి.
పర్యావరణ కాలుష్య కారకాలు, టాక్సిన్స్, పురుగుమందులు, డ్రై-క్లీనింగ్ ద్రావకాలు, సీసం వంటివి సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. వాటికి దూరంగా ఉండటం మేలు. వీలైతే కూరగాయలు అన్నీ ఆర్గానిక్‌వే తీసుకోండి. 
తగినంత నిద్ర లేకపోవడం కూడా ప్రమాదమే. రాత్రి త్వరగా నిద్రపోవాలి.. ఉదయం త్వరగా మేల్కోవాలి. నైట్‌ షిఫ్ట్‌లు చేస్తున్నట్లైతే... తగ్గించండి.. వీలైతే జాబ్‌ మారిన పర్వాలేదు. అసలు రాత్రి పనిచేయడం అనేది పెద్ద చెడ్డ అలవాటు.. మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకున్నట్లు..
ఈ జాగ్రత్తలు పాటించండి.. ఆటోమెటిక్‌గా మీ లైఫ్‌స్టైల్‌ సెట్‌ అవుతుంది.. దీని ద్వారా ఆరోగ్యంగానే కాదు..హాయిగా కూడా ఉండొచ్చు. ఇది స్త్రీ, పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.