యోగా దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు?

యోగా అంటే ప్రపంచంలో తెలియనివారుండరు. కానీ యోగా పుట్టింది మాత్రం మన భారతదేశంలోనే. యోగా విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పింది భారతీయులు. ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పటి ఆధునిక సమాజం వరకు యోగా యొక్క ప్రాశస్త్యం ఇసుమంత కూడా తగ్గలేదు.

యోగా దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు?


యోగా అంటే ప్రపంచంలో తెలియనివారుండరు. కానీ యోగా పుట్టింది మాత్రం మన భారతదేశంలోనే. యోగా విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పింది భారతీయులు. ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పటి ఆధునిక సమాజం వరకు యోగా యొక్క ప్రాశస్త్యం ఇసుమంత కూడా తగ్గలేదు. ఎందుకంటే యోగా వల్ల లాభాలు అన్నీ ఇన్నీ కావు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అనేక సామాజిక సంస్థలు, ఆచార్యులు, సాధువులు, సంప్రదాయ గురువులు యోగా ప్రాశస్త్యాన్ని తెలుసుకుని ముందడుగు వేస్తున్నారు. తద్వారా ఫలితాలూ సాధిస్తున్నారు.

ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో యోగా అనేది తప్పనిసరి చేసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగాలు, పనులతో రోజంతా బిజీబిజీగా గడిపేస్తున్నాం. కాసింత మాససిక విశ్రాంత లేకపోతే.....అనారోగ్యం పాలుకాకతప్పదు. వీటన్నింటి నుంచి ఉపశమనమే....యోగా. కరోనా తర్వాత నుంచి చాలా మంది ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. జిమ్ లు, వ్యాయామశాలలకు పరుగులు పెడుతున్నారు. ఆసక్తి చూపిస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లో యోగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

భారతదేశపు వారసత్వ సంపద అయిన యోగా విశిష్టతను ప్రపంచం నలుమూలలా ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్య సమితి జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. దీన్ని పురస్కరించుకుని భారత ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎంతో ఆనందంతో యోగాసనాలలో పాలు పంచుకుంటున్నారు. దేశ ప్రథమపౌరురాలు నుంచి గ్రామంలో ప్రజల వరకూ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు.  

ఐక్యరాజ్య సమితి వేదికపై 27 సెప్టెంబర్‌ 2014న జరిగిన 69వ సమావేశంలో భారత ప్రధాని అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చారు. ఐరాస 2014 డిసెంబర్‌ 11న 193 సభ్యదేశాల్లో 177దేశాలు ఏకగ్రీవ తీర్మానంతో జూన్‌ 21న ప్రతి ఏడాది యోగా దినోత్సవంగా జరిపేందుకు ఆమోదించింది.


యోగా వల్ల ఎన్నో సానుకూల ఫలితాలు పొందవచ్చు. అందుకే ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. యోగా చేయడం వల్ల అలసట, ఆందోళనను దూరం చేసుకోవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ఏకాగ్రతను సాధించవచ్చు. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.