హలాసనం: థైరాయిడ్‌ సమస్యా.. ఈ ఒక్క ఆసనం వేయండి చాలు..!!

థైరాయిడ్‌ సమస్య చాలా మందికి ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా..ఇది అందరనీ వేధిస్తుంది. మన శరీరంలో ఉన్న అనేక గ్రంథుల్లో థైరాయిడ్‌ గ్రంథి ఒకటి. ఇది అనేక జీవక్రియలను నియంత్రిస్తుంది. శారీరక ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

హలాసనం: థైరాయిడ్‌ సమస్యా.. ఈ ఒక్క ఆసనం వేయండి చాలు..!!


థైరాయిడ్‌ సమస్య చాలా మందికి ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా..ఇది అందరనీ వేధిస్తుంది. మన శరీరంలో ఉన్న అనేక గ్రంథుల్లో థైరాయిడ్‌ గ్రంథి ఒకటి. ఇది అనేక జీవక్రియలను నియంత్రిస్తుంది. శారీరక ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోతే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా ఈ ఆసనం వేయండి.. అన్నీ సెట్‌..! 

Halasana, the Miracle Pose that Helps Reduce Blood Pressure - NDTV Food

హలాసనం

వెల్లకిలా పడుకుని కాళ్లను నెమ్మదిగా పైకి లేపుతూ 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. చేతులు శరీరానికి రెండు వైపులా నేలపై ఆనించాలి. చేతుల సహాయంతో వీపును కటి ప్రదేశం వరకు పైకెత్తాలి. వీపును నడుము వరకు నిట్ట నిలువుగా ఉంచాలి. గడ్డాన్ని కంఠానికి తాకేలా (తల ఎత్తకుండా) చేయాలి. భుజాలపై శరీర భారాన్ని ఉంచుతూ నడుము నుంచి కాళ్ల వరకు వంచాలి. కాళ్లను తల వెనుక నేలపై తాకించాలి. ఈ స్థితిలో మీ కాళ్లను ఎట్టి పరిస్థితిలోనూ కిందకు వంచరాదు. చేతులను నేలపై వెల్లకిలా ఉంచాలి. ఈ స్థితిలో 30 సెకన్ల నుంచి 1 నిమిషం వరకు ఉండవచ్చు. ఈ ఆసనం వేసేటప్పుడు శ్వాస మామూలుగా తీసుకోవాలి.

హలాసనం ఉపయోగాలు

ఈ ఆసనం వేయడం వల్ల థైరాయిడ్‌ సమస్య చాలా వరకు తగ్గుతుంది. 
గ్యాస్ట్రిక్‌, మలబద్దకం, అజీర్ణం సమస్యలు దరి చేరవు. 
రుతు క్రమం సరిగ్గా ఉంటుంది. 
మూత్ర పిండాలు, గర్భాశయం పటిష్టంగా మారుతాయి. 
లైంగిక శక్తి పెరుగుతుంది. శ్వాస సంబంధ వ్యాధులు, మూత్ర సమస్యలు తగ్గుతాయి. 
కాళ్లు, భుజాలు బలోపేతం అవుతాయి.

జాగ్రత్తలు

స్పాండిలైటిస్‌, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది. 
సయాటికా, హెర్నియా, నడుము నొప్పి ఉన్నవారు కూడా ఈ ఆసనం వేయరాదు.

ఈ ఆసనం చూసినంత ఈజీగా ఉండదు.. వెన్ను నొప్పి ఉంటే.. అస్సలు ట్రై చేయకండి. కానీ ఇది వేయగలగితే మాత్రం మీ శరీర ఆకృతి కూడా మెరుగుపడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.