Japanese towel exercise : జపనీస్‌ టవల్‌ వ్యాయామంతో పొట్ట దగ్గరి కొవ్వు ఈజీగా తగ్గించుకోవచ్చు..

Japanese towel exercise న్ని జ‌పాన్‌కు చెందిన డాక్టర్ ఫుకూట్సుడ్జి సూచించారు. డాక్టర్ ఫుకూట్సుడ్జి చెప్పిన దాని ప్రకారం.. ఈ రకమైన భంగిమ బరువు తగ్గడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది. వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. పొట్ట దగ్గరి ఫ్యాట్‌ను కూడా త్వరగా కరిగిస్తుందట..

Japanese towel exercise : జపనీస్‌ టవల్‌ వ్యాయామంతో పొట్ట దగ్గరి కొవ్వు ఈజీగా తగ్గించుకోవచ్చు..
Reduce belly fat with Japanese towel exercise


Over weight.. చూస్తూ చూస్తూనే..weight పెరిగిపోతారు.. వారం రోజుల్లో మీలో మార్పును మీ కంటే ముందు చుట్టుపక్కల వాళ్లు గమనిస్తారు. నిజానికి ఈ ఫేజ్‌ చాలా ముఖ్యం.. సాంత బరువు పెరిగన తర్వాత మేలుకోనే కంటే.. అప్పుడే స్టాటింగ్‌ స్టేజ్‌లో ఉన్నవాళ్లు weight loss కు ప్రయత్నాలు చేశారంటే.. రిజల్ట్‌ త్వరగా ఉంటుంది. సమస్య ఉండదు.. అయితే మనం weight loss కు చాలా diets, వ్యాయామాలు చేస్తుంటాం.. Japanese మాత్రం బరువు తగ్గేందుకు ఒక వెరైటీ towel exercise చేస్తారట.. దీంతో బరువు ఈజీగా తగ్గొచ్చట.. పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగించుకోవచ్చట. అది ఎలానో చూద్దామా..!  

అధిక బ‌రువును త‌గ్గించే జ‌ప‌నీస్ ట‌వ‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌ను ఇలా చేయాలి...

  • మొదట ఒక టవల్‌ను తీసుకుని దానిని రోల్ చేయాలి. చుట్టి మ‌డ‌త‌పెట్టాలి.
  • నేలమీద కూర్చుని మీ కాళ్ల‌ను మీ ముందు చాపి రెండు పాదాల మధ్య 8-10 ఇంచుల దూరం ఉండేలా చూసుకోండి. ఇప్పుడు రోల్ చేసిన ట‌వ‌ల్‌ను మీ వెనుక పెట్టుకోండి.
  • మీ నడుము కింద ట‌వ‌ల్‌ను ఉంచండి. వెన‌క్కి వెల్లకిలా ప‌డుకోండి. కాలి మడమల మధ్య దూరాన్ని కొనసాగిస్తూ మీ కాలి వేళ్ళను ఒకదానికొకటి దగ్గరగా తీసుకోండి. మీ పాదాలను పైకి చూపే త్రిభుజం లాగా ఉంచాలి.  
  • తరువాత మీ చేతులను ఎత్తి వాటితో న‌మ‌స్క‌రిస్తున్న‌ట్లు పెట్టి వాటిని త‌ల వెన‌క‌గా పెట్టండి.
  • ఇలా 5 నిమిషాల పాటు ఉండండి..
ఈ వ్యాయామం చేసేట‌ప్పుడు క‌డుపులో మంట లేదా నొప్పి వ‌స్తాయి. అది స‌హ‌జ‌మ‌నే క్ర‌మంగా చేస్తుంటే అల‌వాటు అవుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట దగ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది.
ఈ వ్యాయామాన్ని జ‌పాన్‌కు చెందిన డాక్టర్ ఫుకూట్సుడ్జి సూచించారు. డాక్టర్ ఫుకూట్సుడ్జి చెప్పిన దాని ప్రకారం.. ఈ రకమైన భంగిమ బరువు తగ్గడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది. వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. పొట్ట దగ్గరి ఫ్యాట్‌ను కూడా త్వరగా కరిగిస్తుందట..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.