ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు.. కానీ అది అందరికీ సాధ్యం కాదు.. మన జీవనశైలి మనల్ని ఆరోగ్యంగా ఉండనీయదు.. ఏదో ఒకటి తినేస్తాం.. వేళ కాని వేళలో భోజనాలు, నిద్రించాల్సిన టైమ్‌లో.. పనులు, అసలు వ్యాయామం చేద్దాం అన్నీ ఓపిక, తీరక లేని షెడ్యూల్.. జీవితం అలా మారిపోయింది. రోజు కనీసం 30 నిమిషాలైనా ఏదో ఒక వ్యాయామం చేస్తే.. ఆరోగ్యంగా ఉండొచ్చు., ఎలాంటి రోగాలు రావని మనకు తెలుసు.. కానీ మనకు అంత టైమ్ లేదు.. అన్ని చేయకపోయినా.. రోజూ ఈ ఒక్క ఆసనం వేయండి.. ఒక్క నిమిషం పాటు ఈ ఆసనం వేయడం వల్ల.. అనేక వ్యాధులకు అడ్డుకట్ట వేయొచ్చు..!

చెయిర్ పోజ్ (కుర్చీ ఆసనం) ను రోజూ కనీసం 1 నిమిషం పాటు వేయగలిగితే చాలు.. ఎన్నో వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఈ చెయిర్ పోజ్‌ను రోజూ వేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. దీంతో తొడలు, మడమలు, పిక్కలు దృఢంగా మారుతాయి. ఈ ఆసనాన్ని ఉదయాన్నే పరగడుపునే వేయాల్సి ఉంటుంది. ముందుగా నేలపై చాప వేసి దాని మీద నిలబడాలి. మోకాళ్ల మీద గోడ కుర్చీ వేసినట్లు వంగాలి. తరువాత చేతులను పైకెత్తి ఎదురుగా చూడాలి. ఛాతి భాగాన్ని కొద్దిగా ముందుకు వంచాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. ఆరంభంలో కనీసం 1 నిమిషం పాటు అయినా ఉండే ప్రయత్నం చేయాలి. తరువాత అలవాటు అయ్యే కొద్దీ రోజూ కాస్తంత సమయాన్ని పెంచుతూ పోవాలి. ఇలా ఈ ఆసనాన్ని రోజూ సులభంగా వేయవచ్చు.
చెయిర్ పోజ్ వల్ల కలిగే ప్రయోజనాలు..
ఈ ఆసనం వేయడంవల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం నుంచి బయట పడవచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. సుఖ విరేచనం అవుతుంది.
ఈ ఆసనం వల్ల నడుము చాలా దృఢంగా మారుతుంది. నడుం నొప్పి తగ్గుతుంది. వెన్నెముక దృఢంగా మారుతుంది.
తొడలు, కాళ్లు దృఢంగా మారుతాయి.
వెన్నెముక సాగే గుణాన్ని పొందుతుంది. వెన్ను నొప్పి తగ్గుతుంది.
నిత్యం కంప్యూటర్ల ఎదుట కూర్చుని ఎక్కువ సేపు పనిచేసేవారికి వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది.
శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తారు. అలసట తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది.