నిమ్మ ఆకులతో ఈ సమస్యలన్నీ మటుమాయం.. 

శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. అయితే వీటిని తీసుకునే విషయంలో కొన్ని పద్దతులు ఉపయోగించాలి. వీటిని డైరెక్ట్‌గా నమలకూడదు. వీ

నిమ్మ ఆకులతో ఈ సమస్యలన్నీ మటుమాయం.. 
All these problems are cured with lemon leaves


vitamin C అధికంగా ఉండే lemon శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉండటంతో పాటు చర్మం నిగరింపుగా ఉంటుంది. అయితే నిమ్మ ఆకులను కూడా తరచూ తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అని తెలుస్తోంది.. 

నిమ్మ ఆకులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. అయితే వీటిని తీసుకునే విషయంలో కొన్ని పద్దతులు ఉపయోగించాలి. వీటిని డైరెక్ట్‌గా నమలకూడదు. వీటిని నీటిలో మరిగించి, టీలా తయారు చేసుకుని తీసుకోవాలి. నాలుగు తాజా నిమ్మ ఆకులను గ్లాసు వేడినీటిలో మూడు గంటలు నానాబెట్టి తాగవచ్చు. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారికి వెంటనే ఉపశమనం దొరుకుతుంది.. మళ్లీ మళ్లీ కిడ్నీలో రాళ్లు వస్తున్న వారు ఇలా చేయడం వల్ల ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు.. 

మైగ్రేన్‌తో బాధపడేవారికి నిమ్మ ఆకులు మేలు చేస్తాయి. నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ యూంటీ ఆక్సిడెంట్‌ గుణాలు, శరీరంలోని ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గించి మ్రైగేన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నిమ్మఆకులు వాసన చూస్తే మైగ్రేన్‌, మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. తరచూ నిద్రలేని సమస్యతో బాధపడే వారు కూడా నిమ్మ ఆకుల వాసన ఎక్కువగా చూడటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.. అలాగే కొందరికి కడుపులో పురుగులు ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి వారికి కూడా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది.. అయితే ఉపయోగించే విషయంలో మితంగా ఉండాలి..

గొంతుకు సంబంధించిన నొప్పి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉన్నప్పుడు నిమ్మ ఆకులతో చేసిన టీ తాగటం వల్ల ప్రయోజనం ఉంటుంది. నిమ్మ ఆకులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆస్తమా రోగులకు సమస్య నుండి ఉపశమనం పొందడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ టీ చర్మానికి మేలు చేస్తుంది. అలాగే వంటకాల్లో విరివిరిగా నిమ్మ ఆకులను ఉపయోగించడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది ఇవి గుండెకు సైతం మేలు చేయడంలో ముందుంటాయి..అయితే ఉపయోగించే విషయంలో మితంగా ఉండాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.