ఎండిన స్ట్రాబెర్రీలను ఎప్పుడైనా చూశారా..? తింటే ఎన్నో ప్రయోజనాలు

స్ట్రాబెరీస్‌ ఫ్లేవర్‌ ఇష్టపడని వాళ్లు ఉంటారేమో కానీ.. స్ట్రాబెరీస్‌ను వద్దనే వాళ్లు ఎవరూ ఉండరు. అవి రుచిగా ఉంటాయి. స్ట్రాబెరీస్‌ను ఎలా తిన్నా సూపర్‌గా ఉంటాయి.. స్ట్రాబెరీస్‌ను వోడ్కాలో వేసుకుని రాత్రంతా ఉంచి తాగితే..

ఎండిన స్ట్రాబెర్రీలను ఎప్పుడైనా చూశారా..? తింటే ఎన్నో ప్రయోజనాలు


Easy Oven-Dried Strawberries - Yummy Toddler Food
స్ట్రాబెరీస్‌ ఫ్లేవర్‌ ఇష్టపడని వాళ్లు ఉంటారేమో కానీ.. స్ట్రాబెరీస్‌ను వద్దనే వాళ్లు ఎవరూ ఉండరు. అవి రుచిగా ఉంటాయి. స్ట్రాబెరీస్‌ను ఎలా తిన్నా సూపర్‌గా ఉంటాయి.. స్ట్రాబెరీస్‌ను వోడ్కాలో వేసుకుని రాత్రంతా ఉంచి తాగితే..అబ్బా ఆ కిక్కే వేరు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది మరియు మధుమేహాన్ని నివారిస్తుంది. ఇవి విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.  రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎండు నారింజలానే ఎండిన స్ట్రాబెరీస్‌ కూడా ఉంటాయి తెలుసా..? వీటిని డ్రై స్ట్రాబెరీస్‌ అంటారు. వీటివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
మీరు ఈ స్ట్రాబెర్రీలను ఎండబెట్టి తిన్నారా? ఎండిన స్ట్రాబెర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండిన స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అవి చాలా విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి. ఎండిన స్ట్రాబెర్రీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల మలబద్ధకం రాకుండా, జీర్ణక్రియ మెరుగుపడి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
ఫైబర్ అధికంగా ఉండే ఎండిన స్ట్రాబెర్రీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే వీటిని తినడం వల్ల ఆకలి తగ్గి బరువు తగ్గవచ్చు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఎండిన స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. ఎండిన స్ట్రాబెర్రీలలో ముఖ్యంగా ఎలాజిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి ముడతలను నివారించి చర్మాన్ని సంరక్షిస్తాయి. 
యాండీ బాడీస్ ఉత్ప‌త్తిని పెంచే ఈ స్ట్రాబెర్రీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఇన్ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఈ స్ట్రాబెర్రీలు మ‌న‌కు తాజా పండ్ల రూపంలో అలాగే డ్రై ఫ్రూట్ రూపంలో కూడా ల‌భిస్తున్నాయి. వీటిని ఏ రూపంలో తీసుకున్నా కూడా మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. రోజులో ఎప్పుడోక‌ప్పుడు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల స‌హ‌జ సిద్దంగా శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో భ‌విష్య‌త్తులో ఎన్ని ర‌కాల వైర‌స్, బ్యాక్టీరియాలు మ‌న శ‌రీరంపై దాడి చేసినా మ‌నం అనారోగ్యాల పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటాము. క‌నుక స్ట్రాబెర్రీల‌ను ఇత‌ర పండ్ల వ‌లె నిత్యం ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.