కిడ్నీ స్టోన్స్ లక్షణాలు మ‌రియు తిన‌కూడ‌ని ఆహార ప‌దార్ధాలు

Kidney Stones కిడ్నీలో రాళ్లుపడటం అనేది ఈరోజుల్లో చాలా కామెన్ ప్రాబ్లమ్ అయిపోయింది. కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి..?, ఏ ఆహారం తీసుకోకూడదు ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలు

కిడ్నీ స్టోన్స్ లక్షణాలు మ‌రియు తిన‌కూడ‌ని ఆహార ప‌దార్ధాలు


కిడ్నీలో రాళ్లుపడటం అనేది ఈరోజుల్లో చాలా కామెన్ ప్రాబ్లమ్ అయిపోయింది. వినటానికి పెద్ద సమస్యలా ఉన్న..అంత హైరానా పడాల్సిన అవసరం లేదు.. మూత్రపిండంలో కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు గట్టిపడి రాళ్లుగా మారుతాయి. సరైన జీవన విధానం లేకపోవడం.. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో చాలా మందిలో కిడ్నీ స్టోన్స్ సమస్యలు వ‌స్తున్నాయి.  మూత్ర విసర్జన సమసయంలో విపరీతమైన నొప్పి, పొత్తికడుపు నొప్పి, వికారం వంటివి వేధిస్తాయి.

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్లు ఈ ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది . అయితే మరి కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి..?, ఏ ఆహారం తీసుకోకూడదు ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు

పొత్తికడుపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.
విపరీతంగా వాంతులు అవుతుంటాయి.
వికారంగా అనిపిస్తుంటుంది.
యూరిన్ సమయంలో కాస్త నొప్పి కలగడం, రక్తం పడవచ్చు.
యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో తీవ్రమైన మంట వస్తుంది.
జ్వరం కూడా వస్తుంది. అకస్మాత్తుగా చెమటలు పట్టడం ప్రారంభమవుతుంది.
వికారం, బలహీనంగా ఉండటం, అలసట జ్వరం వచ్చే అవకాశం ఉండడం

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు తిన‌కూడ‌ని ప‌దార్ధాలు


కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది అని డాక్టర్లు చెబుతున్నారు. ఇక వాటి కోసం చూస్తే…

1. తక్కువ సాల్ట్ తీసుకోండి

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు సాల్ట్ ను తగ్గించడం మంచిది. అందుకనే జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండండి. అలానే కూరల్లో వాటిలో సాల్ట్ ని బాగా తగ్గించండి.

2. మాంసం తగ్గించడం

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్లు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తగ్గించడం మంచిది. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీలకు మంచిది కాదు.

3. చాక్లెట్

కచ్చితంగా చాక్లెట్లు తీసుకోకూడదు. చాక్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ మరింత పెరిగి పోతాయి.

4. విటమిన్ సి

విటమిన్ సి తక్కువగా తీసుకోవడం మంచిది. విటమిన్ సి తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి.

కిడ్నీలో రాళ్లు ఉంటే నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి, మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఆహారంలో సోడియం మొత్తాన్ని చేర్చాలి. ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్లు, కూరగాయల వినియోగాన్ని తగ్గించాలి.

ఇంటి చిట్కాలు:

అన్నిటికన్నా ముఖ్యంగా తులసి తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది అనేక శారీరక సమస్యలను దూరం చేస్తుంది. కషాయాలను కూడా తయారు చేసి తాగవచ్చు. తులసిలో విటమిన్ బి ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను దూరం చేస్తుంది.

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తులసి నమిలితే, కిడ్నీ స్టోన్ కరిగి శరీరం నుంచి బయటకు వస్తుంది.
ఉల్లిపాయను పచ్చిగా తినాలి. దీని రసాన్ని రోజూ 1-2 టీస్పూన్లు తాగుతుంటే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు.
ద్రాక్షలో పొటాషియం, నీరు ఎక్కువగా ఉంటుంది. సోడియం క్లోరైడ్ చాలా తక్కువగా ఉంటుంది.
జామకాయ తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.