నెల రోజుల్లోనే సులువుగా బరువును తగ్గించే వ్యాయామాలు ఇవే..

బరువును తగ్గించే కోసం ఎక్కడికి వెళ్లనవసరం లేదు.. డబ్బులు వెస్ట్ చెయ్యకుండానే..నెల రోజుల్లోనే మీ అధిక బరువును తగ్గించవచ్చు..అందుకు మీరు కేవలం పదినిమిషాలు టైమ్ కేటాయించాలి.. ఇక ఆలస్యం ఎందుకు అదేంటో చూద్దాం పదండీ..

నెల రోజుల్లోనే సులువుగా బరువును తగ్గించే వ్యాయామాలు ఇవే..
Exercises to lose weight easily within a month


Weight loss exercises : శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడంతో over weight  పెరుగుతున్నారు..ఇక weight loss కి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ఫలితం లేక నిరాశకు గురవుతున్నారు..మరికొంత మంది జిమ్ కు సంబందించిన వస్తువులను తెగ కష్టపడుతున్నారు.. అది కూడా కొంతవరకే ఉండటంతో, డాక్టర్ల దగ్గరకు పరిగెడుతున్నారు.. అలాంటివారికి అదిరిపోయే న్యూస్..బరువు తగ్గడం కోసం ఎక్కడికి వెళ్లనవసరం లేదు.. డబ్బులు వెస్ట్ చెయ్యకుండానే..నెల రోజుల్లోనే మీ అధిక బరువును తగ్గించవచ్చు..అందుకు మీరు కేవలం పదినిమిషాలు టైమ్ కేటాయించాలి.. ఇక ఆలస్యం ఎందుకు అదేంటో చూద్దాం పదండీ..

ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్‌..

ముందుగా బోర్లా ప‌డుకుని మోచేతులు, పాదాల మునివేళ్ల‌పై శ‌రీరాన్ని పైకి లేపాలి. ఈ భంగిమ‌లో రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది.. ఇలా రోజులో ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండ చేస్తే మంచి ఫలితం ఉంటుంది..

ప్లాంక్ పొజిష‌న్‌ పుషప్స్..

ఇక రెండోది..ప్లాంక్ పొజిషన్ లో ఉండి పుషప్స్ చెయ్యాలి.. ఇమేజ్ లో చూపినట్లు మూడుసార్లు చేస్తే సరిపోతుంది.. కండరాలు ఫిట్ గా మారతాయి.. పొట్టకింద కొవ్వు కరుగుతుంది..

స్క్వాట్ ఎక్స‌ర్‌సైజ్‌..

ఫొటోలో చూపిన విధంగా..మోకాళ్ల మీద బ‌రువు ఆన్చి గోడ కుర్చీ వేసిన‌ట్లు కూర్చోవాలి. అనంత‌రం వెంట‌నే పైకి లేవాలి. దీన్నే స్క్వాట్స్ అంటారు. గుంజీలు తీయ‌డం అన్న‌మాట‌..ఇలా చెయ్యడం వల్ల స్కిన్ టైట్ అవుతుంది..

బ‌ర్డ్ డాగ్ పోజ్..

పైన చిత్రంలో చూపిన విధంగా ఎడ‌మ చేయిని, కుడి కాలుని పైకి లేపి కొంత సేపు ఉంచాలి. అనంత‌రం మ‌రొక కాలు, చేయిని కూడా అదేవిధంగా ఉంచాలి. దీన్నే బ‌ర్డ్ డాగ్ పోజ్ అంటారు.. ఇలా రోజుకు పొద్దున్న, సాయంత్రం చెయ్యడం మేలు.. సూర్యరశ్మీ లో చేస్తే బాడీ ఫిట్నెస్ తో పాటు డి విటమిన్ కూడా శరీరానికి అందుతుంది..

లైయింగ్ హిప్ రైజెస్..

నేల‌పై వెల్ల‌కిలా ప‌డుకుని మోకాళ్ల‌ను పైకి లేపి చేతుల‌ను ప‌క్క‌కు చాచాలి. అనంత‌రం వెన్నుపై భారం వేస్తూ పొట్ట‌ను పైకి లేపాలి. ఆ భంగిమ‌లో కొంత సేపు ఉండి మళ్లీ య‌థాస్థానానికి వ‌చ్చి.. మ‌ళ్లీ అలాగే వ్యాయామం చేయాలి..

వ్యాయామాలను క్రమం తప్పకుండ చెయ్యడం వల్ల త్వరగా బరువును తగ్గవచ్చు.. అయితే వీటితో పాటు డైట్ ను ఫాలో అవ్వాలి.. జంక్ ఫడ్స్ ను పూర్తిగా మానెయ్యాలి.. ముఖ్యంగా నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి..ఒక్క నెల రోజులు ఇలా కష్ట పడితే చాలు.. స్లిమ్ అండ్ ఫిట్ గా మారతారు.. ఇక ఆలస్యం ఎందుకు ఇలా ట్రై చెయ్యండి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.