నెయ్యి తింటే బరువు పెరుగుతారా..? తగ్గుతారా..?

Ghee అనారోగ్య‌క‌ర‌మ‌ని, దాన్ని తింటే weight Gain అవుతామ‌ని, శ‌రీరంలో కొవ్వు చేరుతుంద‌ని.. చాలా మంది న‌మ్ముతుంటారు. కానీ నిజానికి అది అపోహ మాత్రమే...ఇంట్లో త‌యారు చేసిన శుద్ధ‌మైన ఆవు నెయ్యిని తింటే బ‌రువు పెర‌గ‌రు. త‌గ్గుతారు.

నెయ్యి తింటే బరువు పెరుగుతారా..? తగ్గుతారా..?
Weight loss or gain with ghee


Ghee అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. Ghee వేసకుని పప్పు, పచ్చళ్లు తింటే.. ఆ టేస్టే వేరు. ఇంకా స్వీట్స్‌లో కూడా అంతే.. అయితే చాలామంది weight gain అవుతున్నాం అనగానే.. ghee మానేసేయ్‌ అంటారు. నెయ్యి వల్ల నిజంగా బరువు పెరుగుతారా. ఇంకొంతమంది అయితే నెయ్యి తింటే పింపుల్స్‌ వస్తాయి అని చాలా దూరంగా ఉంటారు. నెయ్యి ఆరోగ్యం అని వైద్యులు అంటారు.. మరి ఎందుకు ఈ అపోహలు..?

నెయ్యి అనారోగ్య‌క‌ర‌మ‌ని, దాన్ని తింటే బ‌రువు పెరుగుతామ‌ని, శ‌రీరంలో కొవ్వు చేరుతుంద‌ని.. చాలా మంది న‌మ్ముతుంటారు. కానీ నిజానికి అది అపోహ మాత్రమే...ఇంట్లో త‌యారు చేసిన శుద్ధ‌మైన ఆవు నెయ్యిని తింటే బ‌రువు పెర‌గ‌రు. త‌గ్గుతారు. నెయ్యిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. కొవ్వులో క‌రిగే అనేక విట‌మిన్లు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు నెయ్యిలో ఉంటాయి. అవ‌న్నీ బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. అందువ‌ల్ల నెయ్యి తింటే బ‌రువు పెర‌గ‌రు.. త‌గ్గుతార‌ని గుర్తుంచుకోవాలి.
న్యూట్రిష‌నిస్టులు ఏం చెబుతున్నారు.. నెయ్యిలో లాక్టోజ్‌, కేసీన్ ఉండ‌దు. అందువ‌ల్ల పాలు, పాల ఉత్ప‌త్తుల‌ను జీర్ణం చేసుకోలేని వారు నెయ్యిని నిర‌భ్యంత‌రంగా తిన‌వ‌చ్చు. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది.
అధిక బ‌రువును తగ్గించుకోవాలంటే నెయ్యిని స‌రైన మోతాదులోనే తీసుకోవాలి. దీంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును కూడా క‌రిగించుకోవ‌చ్చు. నెయ్యిలో అవ‌స‌ర‌మైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కొవ్వు క‌ణాల‌ను కుచించుకుపోయేలా చేస్తాయి. దీంతో కొవ్వు క‌రిగిపోతుంది. శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ని భావించే వారు రోజూ నెయ్యిని తిన‌డం మంచిది. నెయ్యిలో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. అందువ‌ల్ల నెయ్యిని తింటే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.
ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు శ‌రీర ద్ర‌వ్య‌రాశిని పెంచుతాయి. కొవ్వు క‌ణాల‌ను త‌గ్గిస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గుతారు. నెయ్యిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇక జీర్ణ‌శ‌క్తిని పెంచేందుకు కూడా నెయ్యి స‌హాయ ప‌డుతుంది. దీంతో వాపులు త‌గ్గుతాయి.
 నెయ్యి మంచిదే కానీ.. అధికంగా తింటేనే ప్రమాదం. రోజుకు రెండు టీ స్పూన్లు మాత్రమే తినాలి. గేదె నెయ్యికంటే.. ఆవు నెయ్యి ఇంకా మంచిది..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.