వీరభద్రాసనం: గర్భిణీలు వేయదగ్గ తేలికైనా ఆసనం, లాభాలు మాత్రం ఎక్కువే

గర్భిణులు కూడా కొన్ని తెలికపాటి వ్యాయామాలు చేయాలి. అప్పుడే డెలివరీ సులభంగా అవుతుంది. తల్లి, బిడ్డ కూడా హెల్తీగా ఉంటారు. ఊరికే ఇంట్లోనే కుర్చుంటే చాలా ఇబ్బంది పడతారు. యోగాలో నుల్చోనే తెలికగా చేసే ఆసనాలు చాలా..

వీరభద్రాసనం: గర్భిణీలు వేయదగ్గ తేలికైనా ఆసనం, లాభాలు మాత్రం ఎక్కువే


గర్భిణులు కూడా కొన్ని తెలికపాటి వ్యాయామాలు చేయాలి. అప్పుడే డెలివరీ సులభంగా అవుతుంది. తల్లి, బిడ్డ కూడా హెల్తీగా ఉంటారు. ఊరికే ఇంట్లోనే కుర్చుంటే చాలా ఇబ్బంది పడతారు. యోగాలో నుల్చోనే తెలికగా చేసే ఆసనాలు చాలా ఉన్నాయి. యోగా అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు, అలవాటుగా మార్చుకుంటేనే మీరు రోజు కొత్త కొత్త ఆసనాలు నేర్చుకుంటారు. ఆ ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మనం వీరభద్రాసనం ఎలా వేయాలో చూద్దాం. తేలిగ్గా వేయగలికే ఆసనాల్లో ఇదీ ఒకటి. వీరభద్రాసనం పేరు తగ్గట్టుగానే ఈ యోగా భంగిమలో యోధుడిలా పోజులివ్వాలి. ఇది నిలబడి చేసే యోగా భంగిమ, ఇది మీకు శక్తినిస్తుంది, రోజంతా మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. 2 వ లేదా 3 వ త్రైమాసికంలో ఉన్న గర్భిణులకు గొప్ప యోగా భంగిమ.  

వీరభద్రాసనం యొక్క ప్రయోజనాలు 

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది
ఒత్తిడిని దూరం చేస్తుంది
ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
మీ భుజాలు, మోకాలు, తొడలు మరియు చేతులను బలపరుస్తుంది
మీ శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది
మనసును ప్రశాంతపరుస్తుంది
ఇది సంతోషాన్ని కలిగించే సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
స్థిరత్వం, సమతుల్యతను అభివృద్ధి చేస్తుంది
మీ తొడలు, చీలమండలు సాగదీస్తుంది. బాడీ స్ట్రెచ్‌ చేసే ఆసనాలు వేసే ముందు ఈ ఆసనం ప్రాక్టీస్‌ చేయొచ్చు.
ఇది మీ ఉదర అవయవాలను ప్రేరేపిస్తుంది.
 

విరాభద్రసనం ఎలా వేయాలంటే..

పర్వత భంగిమలో నిటారుగా నిలబడండి . మీ కాళ్ళను 3 నుండి 4 అడుగుల దూరంలో ఉంచండి. ఇప్పుడు మీ రెండు చేతులను నేలకి సమాంతరంగా పైకి లేపి, మీ తలను ఎడమవైపుకు తిప్పండి. ఇప్పుడు మీ ఎడమ మోకాలిని వంచి 90° కోణం చేయండి. మీ చేతులు, తొంటిని ఒకే విధంగా, 180°గా ఉంచండి. మీ తలను ఎడమవైపుకి నిటారుగా ఉంచి, మీ ముందువైపు చూడండి. ఈ భంగిమను కొన్ని సెకన్లపాటు వేసి మళ్లీ రిపీట్‌ చేయండి. 

వీరు చేయకూడదు

మీరు తీవ్రమైన మెడ నొప్పి, మోకాలి నొప్పి, భుజం నొప్పి లేదా గుండె సమస్యలతో బాధపడుతుంటే, విరాభద్రాసన సాధన చేయవద్దు.
మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే విరాభద్రాసనం సాధన చేయవద్దు.
వెన్నెముక సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, దీనిని అభ్యసించడం మానుకోండి
మీరు డయేరియాతో బాధపడుతున్నట్లయితే, ఈ ఆసనాన్ని అభ్యసించకండి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.