యోగా చేయాలి అనుకుంటున్నారా.. ఐతే పతంజలి గురువు చెప్పిన ఈ 10 విషయాలు తెలుసా!

ఇప్పుడు చాలా మంది వివిధ ఆరోగ్య సమస్యలకు, ఉత్తమ జీవన విధానానికి యోగాను ఆశ్రయిస్తున్నారు. దగ్గర్లోని యోగా నిపుణుల దగ్గర నేర్చుకునే వాళ్లు కొందరైతే... సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూస్తూ నేర్చుకునే వాళ్లు మరికొంత మంది. అయితే... యోగా చేయడం చాలా మంచిదే అయినా... దానికీ కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.

యోగా చేయాలి అనుకుంటున్నారా.. ఐతే పతంజలి గురువు చెప్పిన ఈ 10 విషయాలు తెలుసా!


ఇప్పుడు చాలా మంది వివిధ ఆరోగ్య సమస్యలకు, ఉత్తమ జీవన విధానానికి యోగాను ఆశ్రయిస్తున్నారు. దగ్గర్లోని యోగా నిపుణుల దగ్గర నేర్చుకునే వాళ్లు కొందరైతే... సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూస్తూ నేర్చుకునే వాళ్లు మరికొంత మంది. అయితే... యోగా చేయడం చాలా మంచిదే అయినా... దానికీ కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా పతంజలి మహర్షి సూచించిన “స్థిరమ్ సుఖం ఆసనమ్” అంటే ఆసనాలు స్థిరం, సుఖంగా ఉండాలని.. శరీరాన్ని, మనస్సును, శక్తిమంతం చేసేలా ఆసనాలు ప్రశాంత వాతావరణంలో సాధన చేయాలని సూచిస్తున్నారు. దాంతో పాటే... కొన్ని సూచనలు చేస్తున్నారు. 

ముఖ్య సూచనలు :

1) ఆసనాలు వేయాలి అనుకునే ముందు మొత్తటి వస్త్రాన్ని వినియోగించాలి. ఇప్పుడైతే... అన్ని చోట్లా యోగా మేట్ లు లభిస్తున్నాయి. వాటిని వినియోగించడం ఉత్తమమని సూచిస్తున్నారు.
2) యోగా సాధన చేసేందుకు అన్ని ప్రదేశాలు అనుకూలంగా ఉండవు. కాబట్టి.. సాధనకు ఏకాంత ప్రదేశంతో పాటు స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఈగలు, దోమలు వంటివి లేకుండా ఉండాలి. వాటి వల్ల ఏకాగ్రత కుదరదు. 
3) యోగాను ప్రారంభించే ముందు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్ధనతో ముగించాలని పతంజలి సూచించారు. అలాగే.. శారీరకంగా, మానసికంగా పూర్తిగా విశ్రాంతి పొందిన తర్వాతే ఆసనాలు వేయాలని చెబుతున్నారు. 
4) యోగా ఆసనాలు వేసేందుకు 30 నిమిషాల ముందు కొద్దిగా నీళ్లు త్రాగడం మంచిది. అలాగే... సాధన ప్రారంభించే ముందే టాయిలెట్ కు వెళ్లాలని... ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్న వాళ్లు... దాని నుంచి బయట పడాలని చెబుతున్నారు. 
5) యోగ సాధకులు ఆసనాలు వేయాలనుకుంటే భోజనం చేసిన తర్వాత అయితే 4 గంటల వరకు యోగా ఆసనాలు వేయొద్దని సూచిస్తున్నారు. అంతే కాదు.. టిఫిన్ తర్వాత 3 గంటలు, పాలు తీసుకుంటే 2 గంటలు, టీ/కాఫీ లాంటి వాటిని తీసుకుంటే 1 గంట వరకు ఆసనాలు సాధన చేయొద్దని చెబుతున్నారు. 
6) ఆకలిగా ఉన్నప్పుడు, ఆయాసం, అలసట, ఆందోళనగా ఉన్నప్పుడు ఆసనములు వేయొద్దని అంటున్నారు..యోగా నిపుణులు.
7) యోగా చేసేటప్పుడు వదులుగా, తేలికగా ఉన్న పరిశుభ్రమైన దస్తులు ధరించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అయితే వజ్రాసనము మాత్రమే భోజనం చేసిన తరువాత కూడా వేయొచ్చు.
స్త్రీలకు ప్రత్యేక సూచనలు :
1) స్త్రీలు పిరీడ్స్ సమయం ఎలాంటి యోగాసనములు వేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్ మహిళలు సరైన శిక్షకుడి దగ్గర తగిన సూచనలతో యోగా సాధన చేయాలని చెబుతున్నారు. 
2) స్త్రీలు ప్రసవానంతరం ఒక నెల రోజుల వరకు యోగాసనాల జోలికి వెళ్లొద్దని 3 నెలలు తర్వాత ఇలాంటి సందేహాలు లేకుండా ఆసనాలు వెయొచ్చని అంటున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.