యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌కు కాన్ బెర్రీ జ్యూస్ వాడొచ్చా..?
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలా మందికి తరచుగా వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా స్త్రీలల్లో వచ్చే అవకాశం ఉంది. మూత్రవిసర్జన చేసే సమయంలో మూత్రనాళం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది. ఇది క్రమంగా

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలా మందికి తరచుగా వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా స్త్రీలల్లో వచ్చే అవకాశం ఉంది. మూత్రవిసర్జన చేసే సమయంలో మూత్రనాళం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది. ఇది క్రమంగా యుటీఐకు దారి తీస్తుంది. ముఖ్యంగా అపరిశుభ్రమైన బాత్రూమ్‌ను వాడటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. యూరీనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు కొన్ని లక్షణాలు మనలో కనిపిస్తాయి. పొత్తి కడుపులో నొప్పిగా ఉంటుంది. తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే మూత్రవిజర్జన సమయంలో నొప్పిగా, మంటగా ఉంటుంది.
మూత్రంలో రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాగే జ్వరం, వాంతులు, మానసికంగా బాగాలేకపోవడం, తలతిరిగినట్టుగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవడం మంచిది. లేదంటే మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మందులతో పాటు సహజంగా కూడా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఈ చిట్కాలను పాటిస్తే మంచిది..
యూటీఐతో బాధపడే వారు కాన్ బెర్రీ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి.ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
యూటీఐతో బాధపడే వారు శతావరి మొక్క వేరు పొడిని ఉపయోగించడం వల్ల సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే నీటిని, పడ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కూడా సమస్య నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ప్రోబయోటిక్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి.
మూత్రవిసర్జన చేసిన తరువాత శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఆ భాగంలో పొడిగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్పెక్షన్‌ను తగ్గించడంలో దోహదపడుతుంది.
గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడ్ వెనిగర్‌ను కలిపి తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల కూడా ఇన్పెక్షన్ తగ్గుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అలాగే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.
సమస్య తగ్గే వరకు లైంగిక చర్యలల్లో పాల్గొనపోవడమే మంచిది.
ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్ నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.