రజస్వల అయినా నెలసరి రావట్లేదా?

ఈరోజుల్లో చాలామంది ఆడవాళ్లకు ఉండే సమస్య...నెలసరి సమస్య. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో విధంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. నియమాలు ఎన్ని పాటించినా తప్పని పరిస్థితులు ఎదుర్కోవల్సి

రజస్వల అయినా నెలసరి రావట్లేదా?


ఈరోజుల్లో చాలామంది ఆడవాళ్లకు ఉండే సమస్య...నెలసరి సమస్య. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో విధంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. నియమాలు ఎన్ని పాటించినా తప్పని పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుంటుంది. దానికి చాలా కారణాలు ఉంటాయి. మారుతున్న జీవన స్థితిగతులు ఒక కారణమైతే......శరీర బరువు కూడా ఒక కారణం.

అయితే బరువు ఎక్కువుగా ఉన్న ఒక సమస్య....బరువు తక్కువగా ఉంటే ఒక సమస్య. బరువు పెరిగితే బ్లీడింగ్‌ ఎక్కువ అయిపొద్ది. ఒక్కోసారి పూర్తిగా బ్లీడింగ్‌ కూడా అవ్వదు. అదీ మరీ సమస్య. దానివల్ల నీరసం, నిస్సత్తువ వచ్చేస్తాయి. అంతేకాకుండా స్పృహ తప్పిపడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా బరువు తక్కువగా ఉంటే......బ్లీడింగ్‌ విపరీతంగా అయిపోయే ప్రమాదం ఉంది. అది కూడా ఒక సమస్య. కాబట్టి బరువును బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవాలి. సరైన మోతాదులో ఫుడ్‌ తీసుకోవాలి. దొరికింది కదా అని ఇష్టమొచ్చినట్లు తినేయకూడదు.

వారసత్వ సమస్యల వల్ల కూడా నెలసరి ప్రాబ్లెమ్స్‌ వస్తాయి. నాన్నమ్మలో, అమ్మమ్మలకో ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా మనకు వచ్చే అవకాశం లేదు.  సాధారణంగా 28 నుంచి 40 రోజుల్లోపు నెలసరి వస్తే రుతుక్రమం సక్రమంగా ఉన్నట్టు.
అయితే చాలా మంది వయసు మీరినా కూడా రజస్వల కారు. ఒకవేళ అయినా మళ్లీ రెండో సారి రజస్వల అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కొందరికి ప్రారంభం నుంచే ఆటంకాలు వస్తుంటాయి. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.... భయపడక్కర్లేదు.

కానీ కొంతమందిలో తొలుత సరిగ్గానే వచ్చినప్పటికీ తర్వాత అడ్డంకులు వస్తాయి. దానికి కారణం మాత్రం హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు. ఈ మధ్య థైరాయిడ్‌ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల ఓవర్‌ బ్లీడింగ్‌ సమస్య లేవనెత్తుతోంది. అంతేకాకుండా పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్‌ ఉన్నవాళ్లు మెడిసిన్‌ తప్పనిసరిగా వాడాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది తెలుసుకోవాలి....అదే పీసీఓడీ. కౌమార దశలో ఉన్న ఆడపిల్లల్లో ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. హార్మోన్ల అసమతుల్యతను బ్యాలెన్స్ చేయడానికి శరీరం ఎలాంటి హార్మోన్లను తయారు చేయలేదు. కాబట్టి దానికి అనుగుణంగా ఆహారాన్ని శరీరానికి అందిస్తే...అప్పుడు అది సరైన విధంగా అమలు చేస్తుంది.  నువ్వులూ, అవిసె, చియా, అక్రోట్స్‌, శెనగ గింజల్లో మంచి ప్రోటీన్స్‌ ఉంటాయి. అవి శరీరంలోకి చేరి హార్మోన్ల అసమతుల్యతను సరి చేస్తాయి. అయితే ఇంకోవిషయం ఇది శరీర తీరుపై ఆధారపడి ఉంటుంది.

కాబట్టి రజస్వల అయిన ఆడపిల్లలు మంచి బలవర్థకమైన ఆహారం తినాలి. ఇప్పటి పిల్లలు ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటుపడిపోయారు. కాబట్టి దాన్నుంచి బయటకు తేవాలి. లేకపోతే ఊబకాయం వచ్చేసి....పీరియడ్స్‌ గాడి తప్పుతాయి. అది ప్రతి తల్లి....తన పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.