Menstruation : నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందా.. కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి.. 

కొందరిలో bleeding ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాగే pain కూడా ఎక్కువగా ఉంటుంది.. అయితే అసలు ఎంత bleeding అవ్వాలి ఎక్కువగా pain వస్తే ఏం చేయాలి వంటి విషయాలు తెలుసుకుందాము.. 

Menstruation : నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందా.. కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి.. 
Reasons for more Bleeding during menstruation


ప్రతి నెల ఎదురుకోవలసిన విషయాల్లో ఒకటి periods. అయితే ఇది అందరిలో ఒకే రకంగా ఉండదు వారి శరీర తత్వాన్ని బట్టి హార్మోన్ల తీరును బట్టి మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కొందరిలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాగే pain కూడా ఎక్కువగా ఉంటుంది.. అయితే అసలు ఎంత బ్లీడింగ్ అవ్వాలి ఎక్కువగా పెయిన్ వస్తే ఏం చేయాలి వంటి విషయాలు తెలుసుకుందాము.. 

సాధారణంగా 21 రోజుల నుంచి 40 రోజుల వరకు రుతుక్రమం రావచ్చు. అయితే 28 రోజులకు వస్తే సక్రమంగా వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చినా పెద్ద సమస్యగా పరిగణించక్కర్లేదు. అలాగే ఈ సమయంలో 30 నుంచి 72 ఎం ఎల్ రక్తం విడుదలవుతూ ఉంటుంది అంటే దాదాపు 5 నుంచి 12 టేబుల్ స్పూన్ల వరకు అనుకోవచ్చు.. అయితే రక్తం 80 ఎం ఎల్ దాటి అవుతుంటే మాత్రం హెవీ బ్లీడింగ్ గానే పరిగణించాలి.. 

ముఖ్యంగా గంటకొకసారి పాడ్ మార్చాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా నడుము నొప్పి కడుపునొప్పి వంట సమస్యలు వస్తున్నా హార్మోన్లో మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడానికి డాక్టర్ని సంప్రదించాలి. అలాగే గర్భసయానికి సంబంధించి ఏవైనా సమస్యలు మొదలవుతున్నా కూడా ఇలానే ఉంటుంది.. 

అలాగే హార్మోన్లో హెచ్చుతగ్గులు గర్భాశయంలో కణతులు ఉన్నప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మోనోపాస్కు దగ్గర పడిన మహిళల్లో కూడా హెవీ బ్లీడింగ్ కనిపిస్తుంది.. అలాగే కొన్ని రకాల మందులు వాడినప్పుడు అవి హార్మోన్ల పైన ప్రభావం చూపిస్తూ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది అలాగే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినప్పుడు కూడా ఇదే జరుగుతుంది.. అయితే హెవీ బ్లీడింగ్ అవుతున్న సమయంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే వీలైనంతవరకు ఎక్ససైజ్లు చేయడం మంచిది. మరి సమస్య మితిమీరితే డాక్టర్ను సంప్రదించాలి.. అలాగే కొందరు ఈ విషయంలో సొంత వైద్యానికి వెళుతూ ఉంటారు అలా కాకుండా నిపుణుల సలహాను తీసుకోవడం వల్ల దీర్ఘకాలంగా సమస్యలు రాకుండా ఉంటాయి.. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.