గర్భిణీలు పసుపు కలిపిన పాలు తాగితే ఏమోతుందో తెలుసా?

సర్వరోగ నివారిణి పసుపు. ఇంటికి, ఒంటికి ఎంతో మేలు. అన్ని రకాలుగా దీన్ని ఉపయోగించవచ్చు. వానం వాడే క్రీముల నుంచి.....అన్నింటీలోనూ దీని మూలం ఉండనే ఉంటుంది. ప్రపంచమంతా దీని ప్రాచుర్యం ఉంది

గర్భిణీలు పసుపు కలిపిన పాలు తాగితే ఏమోతుందో తెలుసా?


సర్వరోగ నివారిణి పసుపు. ఇంటికి, ఒంటికి ఎంతో మేలు. అన్ని రకాలుగా దీన్ని ఉపయోగించవచ్చు. వానం వాడే క్రీముల నుంచి.....అన్నింటీలోనూ దీని మూలం ఉండనే ఉంటుంది. ప్రపంచమంతా దీని ప్రాచుర్యం ఉంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని.....తెలియంది కాదు. చిన్న పిల్లల గురించి పెద్దలవరకు అందరికీ దీని ప్రాముఖ్యత తెలుసు. కూరల్లో ఉపయోగించడం నుంచి ఔషధ తయారీల వరకు వివిధ రూపాల్లో దీనిని ఉపయోగిస్తారు.

385,200+ Pregnancy Woman Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock | Happy pregnancy woman, Pregnancy woman icons, Pregnancy woman and  doctor

అనేక వ్యాధులను తగ్గించటంలో పసుపు సహాయం చేస్తుంది. రోజూ పొద్దున్నే గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగడం వల్ల కడుపులో మలినాలను శుభ్రం చేస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. పసుపు నీరు చర్మాన్ని మరింత కాంతివంతంగా చేయడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

పసుపును ఆయుర్వేదంలో మంటను తగ్గించడానికి ఉపయోగిస్తారు. పసుపు పాలు ఉదరంలో వేడిని పెంచుతాయి. గర్భాశయంలో నులినొప్పి, రక్తస్రావం, తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది. మొదటి ౩ నెలలు గర్భదారణ సమయంలో పసుపు పాలు తాగడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. పసుపు నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

పసుపు వల్ల కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి, జలుపు,దగ్గు వస్తే పసుపు పాలు తాగటం కొందరికి అలవాటు. అయితే అందరూ అలా చేయకూడదు. మన ఆరోగ్య వ్యవస్థ బట్టి తీసుకోవచ్చా లేదా అనేది తెలుసుకోవాలి.

అంతేకాకుండా ఈ పసుపు ద్వారాలకు పూయడం వల్ల బయట సూక్ష్మజీవులు ఇంట్లోకి రాలేవు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. అందుకే పెళ్లిళ్లలో, శుభకార్యాల్లో పసుపును పవిత్రంగా చూస్తారు.

Pregnant Woman Images - Free Download on Freepik

అయితే ఇంకో విషయమేమిటంటే మనం సాధారణంగా మార్కెట్లో దొరికే పసుపునే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. అలా కాకుండా పసుపు కొమ్ములను సన్నికళ్లుపై నూరి ఆ ముద్దను కూరళ్లోనూ, శుభకార్యాలకు వినియోగించవచ్చు. దానివల్ల పసుపు శరీరానికి అంటుకుంటుంది. బయట దొరికేవి శరీరానికి రాసాక నీళ్లు పోసినవెంటనే పోతుంది. కూరల్లో పసుపు పొడి కంటే ఇలా ముద్ద చేసి వాడితే....కూర కూడా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలా అని ఎండాకాలంలో ఈ పసుపును శరీరానికి రాసుకోకూడదు. ఎందుకంటే పసుపు వేడి చేస్తుంది. కాబట్టి వేసవిలో రాసుకుంటే శరీరమంతా మంటమంటగా ఉంటుంది. శీతాకాలంలో, ముఖ్యంగా వర్షాకాలంలో రాసుకుంటే ఫలితం ఉంటుంది. శీతాకాలంలో చలి నుంచి రక్షణగా ఉండటమే కాకుండా శరీరం కూడా మెరుస్తుంది. వానాకాలంలో రోగాలు రాకుండా కాపాడుతుంది.

అందులో పచ్చి పసుపులో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్‌తో పోరాడే గుణాలు ఉన్నాయి. సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత వ్యాధులను నివారించే గుణాలు ఉన్నాయి. పచ్చి పసుపు వాడటం వల్ల కాలేయ సంబంధ వ్యాధులు రావు. పిత్తాశయం, ఇతర జీర్ణ ఎంజైమ్‌లలో పిత్త ఉత్పత్తిని పెంచడం ద్వారా పసుపు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం లక్షణాలను తగ్గిస్తుంది. మీ జీవక్రియను పెంచడంలో సాయపడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.