పిల్స్‌, అబార్షన్‌ వల్ల వచ్చే నష్టమేంటీ?

ఇప్పుడున్న యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నా...కొన్ని రోజులు ఎంజాయ్‌ చేయాలంటూ పిల్లల్ని వద్దనుకుంటున్నారు. దాని కోసం ఎంచుకునే ఏకైక మార్గం....పిల్స్‌. లేదంటే అబార్షన్‌ చేసుకోవడం. కామన్‌ అయిపోయింది. కానీ ఎప్పుడు

పిల్స్‌, అబార్షన్‌ వల్ల వచ్చే నష్టమేంటీ?


ఇప్పుడున్న యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నా...కొన్ని రోజులు ఎంజాయ్‌ చేయాలంటూ పిల్లల్ని వద్దనుకుంటున్నారు. దాని కోసం ఎంచుకునే ఏకైక మార్గం....పిల్స్‌. లేదంటే అబార్షన్‌ చేసుకోవడం. కామన్‌ అయిపోయింది. కానీ ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి. ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. ప్రతి దానికి పద్ధతులు ఉంటాయి. దాని ప్రకారం పిల్స్‌ వాడాలి. నియమాలు తెలుసుకోకపోతే....చాలా ప్రమాదం. లేకపోతే గర్భాశయం నాశనమయ్యే ప్రమాదం ఉంది.

లాస్ట్ పీరియడ్ మొదటి రోజు నుంచి 70 రోజులలోపు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే పిల్, మెడికల్ అబార్షన్‌కి వెళ్లవచ్చు. అబార్షన్ ట్యాబ్లెట్స్ లాస్ట్ పీరియడ్ మొదటి రోజు 49 రోజుల వరకు ఎక్కువగా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. వైద్యుల సలహా మేరకు పిల్‌ వాడితే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దీనివల్ల కూడా ప్రమాదం ఉంది. వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి.

పిల్స్‌ వాడటం వల్ల తిమ్మిరిగా అనిపించడం, పొత్తికడుపు నొప్పిగా ఉంటుంది. సాధారణం అయ్యే రోజుల్లో కాకుండా పిల్స్‌ వేసుకునే రోజుల్లో రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువ రోజులు అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల కాళ్లు పీకులు, నడుం నొప్పి వస్తుంది. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. కాకపోతే అది తాత్కాళికం మాత్రమే. ఇవి కొంతసేపే ప్రభావం చూపుతాయి. కానీ కొన్నిసార్లు దీర్ఘకాలికంగా ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి.

గర్భం దాల్చాక 10 వారాలు దాటితే పిల్స్‌ పనిచేయవని వైద్యులు చెబుతున్నారు. అంతకన్నా ప్రమాదం కూడానూ. దానివల్ల అబార్షన్ సరిగ్గా జరగకపోతే ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. బొడ్డు ప్రాంతంలో తిమ్మిరితో పాటు అధికంగా నొప్పులు వస్తాయి. ఒకవేళ టాబ్లెట్‌ వేసుకున్న కొన్ని రోజులపాటు రక్తస్రావం జరుగుతుంది.

ఈ మాత్రలు.. శరీరంలో ఉత్పత్తి అయ్యే గర్భధారణ హార్మోన్ ప్రొజెస్టెరాన్‌ను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా పిండం గర్భాశయం నుంచి బయటకు వస్తుంది. సాధారణంగా టాబ్లెట్ వేసుకున్న చాలామంది స్త్రీలలో.. గంట తర్వాత అధిక తిమ్మిరి, రక్తస్రావం కలుగుతుంది. దాని ఫలితంగా రక్తం ఎక్కువగా గడ్డకట్టడం, కణజాల గుబ్బలు అనేవి కొంత సమయం వరకు విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. ఆ నొప్పి భరించలేనంతంగా ఉంటే.. కంట్రోల్ చేసే టాబ్లెట్స్‌ను తీసుకోవాలని డాక్టర్స్ సలహా ఇస్తున్నారు

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.