పిల్లలకి ఏ వయసులో తల్లిపాలు మానిపించాలో తెలుసా??

సాధారణంగా చిన్న పిల్లలకి పాలు మానిపించడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. ముఖ్యంగా ఏ వయసులో ఎప్పుడు మానిపించాలి అనే విషయం తల్లికి ఖచ్చితంగా తెలియాలి. లేదంటే వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

పిల్లలకి ఏ వయసులో తల్లిపాలు మానిపించాలో తెలుసా??


సాధారణంగా చిన్న పిల్లలకి పాలు మానిపించడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. ముఖ్యంగా ఏ వయసులో ఎప్పుడు మానిపించాలి అనే విషయం తల్లికి ఖచ్చితంగా తెలియాలి. లేదంటే వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
Baby Feeding Schedule: Tips for the First Year
పిల్లలకి పాలు మానిపించడానికి ప్రయత్నించే సమయంలోనే నెమ్మదిగా ఘన ఆహారాన్ని అందించడం అలవాటు చేయాలి. పాలు పై ఆధారపడటం తగ్గించాలి.
సాధారణంగా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆరు నెలల పాటు కేవలం పిల్లలకి తల్లిపాలు ఇవ్వాలి. ఆ తర్వాత, తల్లి పాలు మాన్పించే ప్రక్రియను ప్రారంభించాలి.. ఆ తర్వాత నుంచి బిడ్డ ఆరోగ్యం తల్లి ఆరోగ్యం రెండు పరిగణలోకి తీసుకుంటూ ఏ సమయంలో తల్లిపాలు మానిపించాలో కచ్చితంగా తెలుసుకోవాలి.
ఆరు నెలలు దాటిపోయిన తర్వాత పిల్లలు ఎదుగుదల వేగవంతం అవుతుంది. ఈ సమయంలో కేవలం తల్లిపాలు మాత్రమే సరిపోవు. అందుకే ఘన ఆహారాన్ని ఇస్తూ ఉంటారు.. ఈ సమయంలో కేవలం పాలు మాత్రమే ఇస్తే, ఐరన్, ఇతర పోషకాలు వారి శరీరంలో లోపిస్తాయి. దీంతో వారు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది..
తల్లిపాలు మానిపించడానికి తేలికైన పద్ధతులు..
ఆరు నెలలు దాటిన తర్వాత పిల్లలకు నెమ్మదిగా తల్లిపాలను తగ్గిస్తూ ఉండాలి. ఈ సమయంలో తగిన పోషకాహారం అందించాలి. ఘన ఆహారాన్ని అందిస్తూ రోజుకి మొదట్లో ఏదో ఒక పూట పాలను మాన్పించేయాలి.
అనంతరం కొన్ని రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగాక నెమ్మదిగా వేడి నీళ్లు తాగించటం, ఆహారానికి ఆహారానికి మధ్య కాస్త విరామం ఇస్తూ ఆ సమయంలో అప్పుడప్పుడు తల్లిపాలను ఇవ్వవచ్చు.
ఇలా కొన్ని నెలలు అనంతరం రోజుల్లో ఏదో ఒక పూట మాత్రమే బిడ్డకు తల్లిపాలు ఇస్తూ తర్వాత నెమ్మదిగా ఈ అలవాటును దూరం చేసేయాలి.
సాధారణంగా చిన్నపిల్లలు పాలని మానటానికి ఇష్టపడరు. అందుకే ఈ సమయంలో వారితో నెమ్మదిగా వ్యవహరించడం అవసరం. నెమ్మదిగా బుజ్జగిస్తూ వారికి ఘన ఆహారాన్ని సరిపడేంత ఇవ్వడం వల్ల పాలపై వ్యామోహం తగ్గిపోతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.