శానిటరీ ప్యాడ్స్‌ వల్ల మంట, దురదా..? ఇలా చేయండి..!

ఈరోజుల్లో మహిళలు పిరియడ్స్‌ సమయంలో ఎక్కువగా ప్యాడ్స్‌నే వాడుతున్నారు. ఒకప్పుడు అంటే క్లాత్‌ వాడేవాళ్లు. కానీ కాలం మారింది. ప్యాడ్స్‌ అయితే కాస్త కంఫర్ట్‌గా ఉంటాయి, మళ్లీ వాటిని క్లీన్ చేసే పంచాయితీ ఉండదు. అయితే వీటివల్ల అటు పర్యావరణానికి, ఇటు మీ

శానిటరీ ప్యాడ్స్‌ వల్ల మంట, దురదా..? ఇలా చేయండి..!


ఈరోజుల్లో మహిళలు పిరియడ్స్‌ సమయంలో ఎక్కువగా ప్యాడ్స్‌నే వాడుతున్నారు. ఒకప్పుడు అంటే క్లాత్‌ వాడేవాళ్లు. కానీ కాలం మారింది. ప్యాడ్స్‌ అయితే కాస్త కంఫర్ట్‌గా ఉంటాయి, మళ్లీ వాటిని క్లీన్ చేసే పంచాయితీ ఉండదు. అయితే వీటివల్ల అటు పర్యావరణానికి, ఇటు మీ ఆరోగ్యానికి రెండు విధాల ఇబ్బందే అవుతుంది. న్యాప్‌కిన్‌లలోని రసాయనాలు మీ జననాంగాలు, తొడల చర్మాన్ని చికాకు పెడతాయి. ఈ చికాకు దురద, తేమ వల్ల కలుగుతుంది. కొన్నిసార్లు సువాసన కలిగిన నాపీ ప్యాడ్‌లు కూడా చర్మ అలెర్జీలకు కారణమవుతాయి. మనం ఏమో.. మంచి స్మెల్‌ వచ్చేవే ఏరికోరీ మరీ తీసుకుంటాం. అసలు అవి ఇంకా డేంజర్‌. అటువంటి పరిస్థితులలో మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే, వేరే బ్రాండ్ ప్యాడ్‌లు లేదా కాటన్ ప్యాడ్‌లను ఉపయోగించడం. బహిష్టు సమయంలో న్యాపీ ప్యాడ్స్ వల్ల కలిగే చికాకును కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అవి ఏంటంటే..
Sanitary Pads Disposal: Current Methods & Challenges | Sparkle
యాపిల్ సైడర్ వెనిగర్ దురదను తగ్గిస్తుంది. కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. అందులో కాటన్ బాల్ డిప్ చేసి గాయాలపై అప్లై చేయాలి. అది ఆరిపోయే వరకు ఉంచండి. రోజూ మూడుసార్లు ఇలా చేయండి.

ఐస్‌ క్యూబ్స్‌:

ఐస్‌ క్యూబ్స్‌ నొప్పి, వాపును తగ్గిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కొన్ని ఐస్ ప్యాక్‌లను తీసుకొని, దానిని ఒక గుడ్డలో చుట్టి ప్రభావిత ప్రాంతాలకు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల దద్దుర్ల నుంచి మీకు తక్షణ ఉపశమనం కలుగుతుంది.
 

కొబ్బరి నూనె:

ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ డైపర్ రాష్‌కు అద్భుతమైన నివారణ అని చెప్పవచ్చు. ఇది మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. రాత్రి పడుకునే ముందు, ప్రభావిత ప్రాంతాలను చల్లటి నీటితో కడగి ఆ తర్వాత కొబ్బరి నూనెను ఆ ప్రాంతంలో రాయండి. అది రాత్రిపూట ఉండనివ్వండి. మీరు దీన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత కూడా ఉపయోగించవచ్చు.
 

వేప ఆకు:

వేప నూనె జుట్టు , చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మీకు న్యాపీ రాష్ నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే.. ఒక బాణలిలో నీటిని మరిగించాలి. అందులో 20 వేప ఆకులను వేయాలి. ఆకులోని రసమంతా బాగా పోయేలా మరిగించండి. ఆ తర్వాత స్టౌ ఆపేసి నీళ్లు చల్లారనివ్వాలి. వేప రసం గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత, ప్రభావిత ప్రాంతాలను దీనితో బాగా కడగాలి. వీటిని స్నానం చేసే నీళ్లలో కూడా కలుపుకోవచ్చు. వేప ఆకులు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
బహిష్టు సమయంలో సింథటిక్ ఫైబర్స్ లేదా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల ఒళ్లు నొప్పులు పెరుగుతాయి. కాబట్టి అలాంటి దుస్తులు ధరించవద్దు. మీరు మెన్‌స్ట్రువల్ కప్పులు, కాటన్ ప్యాడ్‌లు మొదలైనవాటిని కూడా ఉపయోగించవచ్చు. శానిటరీ ప్యాడ్స్‌ వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగు గంటలకు మించి శానిటరీ ప్యాడ్‌ను వాడొద్దు. మీకు బ్లీడింగ్‌ అయినా అవ్వకున్నా మార్చేయండి. మరీ మంచిది ఇప్పుడు మార్కెట్‌లో రియూసబుల్‌ శానిటరీ ప్యాడ్స్‌ వస్తున్నాయి. ఇవి ప్యూర్‌ కాటన్‌తో చేస్తారు. కాస్త వాటిని క్లీన్‌ చేసుకోవడం శ్రమ అనుకోకపోతే మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. !
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.