ఉపవాసం చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి.

ఒక మనిషి రోజంతా పని చేసి ఎలా అలసిపోతారో. పొట్ట కూడా అంతే. దానికి అప్పుడప్పుడు విశ్రాంతి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే పొట్ట కూడా యంత్రం లాంటిదే. మెషిన్లు రోజంతా పనిచేశాక ఆపకపోతే....వేడేక్కిపోతాయి. అదే సెలవుల్లో విశ్రాంతి ఇవ్వడం

ఉపవాసం చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి.


ఒక మనిషి రోజంతా పని చేసి ఎలా అలసిపోతారో. పొట్ట కూడా అంతే. దానికి అప్పుడప్పుడు విశ్రాంతి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే పొట్ట కూడా యంత్రం లాంటిదే. మెషిన్లు రోజంతా పనిచేశాక ఆపకపోతే....వేడేక్కిపోతాయి. అదే సెలవుల్లో విశ్రాంతి ఇవ్వడం వల్ల అది త్వరగా పాడవకుండా ఉంటాయి. అలాగే పొట్ట కూడా. రోజూ ఏది బడితే అది తినడం వల్ల.....జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టేస్తుంది.

Intermittent Fasting - Diet Plan, Benefits, And Weight Loss - Blog -  HealthifyMe

కాబట్టి ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. పొట్టకు విశ్రాంతి ఇవ్వడం అంటే ఏమిటి? అంటే....అదే అప్పుడప్పుడు ఉపవాసం చేయడం చాలా మంచిది. దానివల్ల శరీరంలో ఉండే కొవ్వును శక్తిగా మార్చుకుని ఉపయోగించుకుంటుంది. అదే పొట్టకు రెస్టు ఇవ్వకపోతే....కొవ్వు కూడా భారీగానే పేరుకుపోతుంది.

ఉపవాసంలో ఏం జరుగుతుందంటే జీర్ణాశయానికి పూర్తి విశ్రాంతి ఇవ్వబడుతుంది. కాబట్టి ఉన్న దానితోనే శక్తిని తయారుచేసుకుంటుంది. అప్పుడు అదనంగా జీర్ణాశయం పనిచేయక్కర్లేదు. ఉన్న వ్యర్థాలను యూరిన్‌ రూపంలోనో,,చెమట రూపంలోనో బయటకు పంపేస్తుంది. అప్పుడు శరీరం మొత్తం క్లీన్‌ అయి....మళ్లీ ఉత్సాహంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. వారానికి ఒక ఉపవాసం శరీరానికి ఇంత మేలు చేస్తుంది.

What Are the Pros and Cons of Intermittent Fasting? | Mass General Brigham

అలా అని ప్రతిరోజూ ఉపవాసం చేయకూడదు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇంక నీరసం పెరిగి కళ్లు తిరిగిపడిపోయే ప్రమాదం ఉంది. ఉపవాసం అంటే పూర్తిగా తినకుండా ఉండటం కాదు. పళ్లరసాలు, పళ్లు, ఇలాంటివి తినొచ్చు. అలా అని అదే తినకూడదు. రెండు పూటలా గ్యాస్‌ జ్యూస్‌ తాగి మమ అనిపించాలి. అప్పుడు ఒంటికి నీరసం అనిపించదు. ఉపవాసం చేసామనే భావన కలుగుతుంది.

మొత్తానికి తెలుసుకోవల్సింది ఏంటంటే......తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకానీ రాత్రిపూట పడుకునే ముందు బండెడు తినేసి మంచం ఏక్కిపోవడం కాదు. సుమారు సాయంత్రం 7, 8 కల్లా తినేస్తే....పడుకునే సమయానికి అరిగిపోతుంది. తెల్లారేసరికి ఉత్సాహంగా అనిపిస్తుంది. అర్థరాత్రులు, అపరాత్రులు తింటే... అది సరిగ్గా అరగదన్నమాట. రాత్రి తిన్న గొంతులోనే ఉండిపోవడం వల్ల....పొద్దున్నే బ్రష్‌ చేసేటప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. ఇంకా రోజంతా నరకమే. ఇంక ఏదీ తినాలనిపించదు వికారంగా ఉంటుంది

అప్పట్లో రోజూ సాయంత్రం 7 కాగానే తినేసేవారు. మళ్లీ ఉదయానికే తినేసి ఎవరి పనులు వాళ్లు చేసుకునేవారు కాబట్టే అంత ఆరోగ్యంగా ఉన్నారు. అందుచేత ఈనాటి మన ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

ఉపవాస సమయంలో ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లు తినొద్దు. లేకపోతే ఎసిడిటీ వస్తుంది. తగినంత నీరు తాగాలి. అలా అని ఒకేసారి నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. మజ్జిగ, చల్లని పాలు, కొబ్బరి నీరు తాగవచ్చు.

వారానికి  ఓ ఉపవాసం చాలా మంచిది. శరీరంలో పేరుకుపోయిన  కొవ్వును కరిగించుకోవచ్చు. సాత్విక ఆహారం తీసుకోండి, పచ్చికూరగాయలు, ఆకుకూరలు, సలాడ్లు, తినండి. ఆరోగ్యంగా ఉండండి

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.