శరారానికి బలాన్ని ఇచ్చే త్రిపాకం.. ఇలా తయారు చేసుకోండి..!

స్వీట్‌ అంటే చాలు శనగపిండే వాడేస్తాం. శ‌న‌గ‌పిండితో మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తుంటాం. శ‌న‌గ‌పిండితో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. శ‌న‌గ‌పిండితో త్రిపాకాన్ని కూడా త‌యారు చేసుకుని తింటే శరీరానికి. ఎంతో బలం, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. జనరల్‌గా స్వీట్స్‌ అతిగా తినడం

శరారానికి బలాన్ని ఇచ్చే త్రిపాకం.. ఇలా తయారు చేసుకోండి..!


స్వీట్‌ అంటే చాలు శనగపిండే వాడేస్తాం. శ‌న‌గ‌పిండితో మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తుంటాం. శ‌న‌గ‌పిండితో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. శ‌న‌గ‌పిండితో త్రిపాకాన్ని కూడా త‌యారు చేసుకుని తింటే శరీరానికి. ఎంతో బలం, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. జనరల్‌గా స్వీట్స్‌ అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటారు. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. శ‌న‌గపిండితో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 20 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు రుచిగా, సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ తీపి వంట‌కాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయే ఈ చ‌క్క‌టి తీపి వంట‌కాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..!
Tripakam : శ‌రీరానికి బ‌లాన్ని.. ఆరోగ్యాన్ని ఇచ్చే స్వీట్ ఇది.. రుచిగా  ఉంటుంది..!

త్రిపాకం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, 
ప‌టిక బెల్లం – ఒక క‌ప్పు, 
జీడిపప్పు -ఒక క‌ప్పు, 
కాచి చ‌ల్లార్చిన పాలు – రెండు క‌ప్పులు, 
నెయ్యి – అర క‌ప్పు, 
కుంకుమ పువ్వు నీళ్లు – కొద్దిగా.

త్రిపాకం త‌యారీ విధానం..

ముందుగా ప‌టిక బెల్లాన్ని దంచి జార్‌లో వేయాలి. దీనిని మెత్త‌ని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే జార్‌లో జీడిపప్పు వేసి కొద్దిగా ప‌లుకులు ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో శ‌న‌గ‌పిండి వేసి చిన్న మంట‌పై కొద్దిగా రంగు మారే వ‌ర‌కు క‌లుపుతూ వేయించండి. శ‌న‌గ‌పిండి వేగ‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసి పిండిని పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. పిండి చ‌ల్లారిన త‌రువాత పాలు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ ఆన్ చేసి మ‌ధ్య‌స్థ మంట‌పై ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు క‌లపండి. శ‌న‌గ‌పిండి మిశ్ర‌మం ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత ప‌టిక బెల్లం పొడి, కుంకుమ పువ్వు నీళ్లు పోసి క‌ల‌పండి..
త‌రువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ క‌లుపుతూ ఉడికించాలి. ఈ మిశ్ర‌మం క‌ళాయికి అంటుకోకుండా నెయ్యి పైకి తేలే వ‌ర‌కు ఉడికించండి. మిక్సీ ప‌ట్టుకున్న జీడిపప్పు పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు చ‌క్క‌గా క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని గిన్నెలోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే త్రిపాకం త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.