ఈ జాగ్రత్తలతో ఒబెసిటి ఫట్...

ఈరోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఉబకాయం, ఒబిసిటీ. వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే నిజానికి వీటి మధ్య తేడా చాలా మందికి తెలియదు. ఒక మనిషి ఉండాల్సిన బరువు కన్నా 10 కేజీలు ఎక్కువ ఉంటే ఊబకాయం అంటారు. అదే 10 కేజీల కన్నా ఎక్కువ ఉంటే ఒబిసిటీకి దారితీస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంటిలోనే తేలిగ్గా బరువు తగ్గవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం..

ఈ జాగ్రత్తలతో ఒబెసిటి ఫట్...


ఈరోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఉబకాయం, ఒబిసిటీ. వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే నిజానికి వీటి మధ్య తేడా చాలా మందికి తెలియదు. ఒక మనిషి ఉండాల్సిన బరువు కన్నా 10 కేజీలు ఎక్కువ ఉంటే ఊబకాయం అంటారు. అదే 10 కేజీల కన్నా ఎక్కువ ఉంటే ఒబిసిటీకి దారితీస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంటిలోనే తేలిగ్గా బరువు తగ్గవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం..
బరువు తగ్గాలనే ప్రతి ఒక్కరూ ముందుగా హైట్, వెయిట్ కి సంబంధించిన చార్ట్ కచ్చితంగా చూసుకోవాలి. దీని ప్రకారం ఉండవలసిన బరువు కన్నా ఎంత ఎక్కువ ఉన్నారో నిర్ధారించుకోవాలి. బరువు తగ్గడానికి నిర్దిష్టమైన ప్రణాళిక అత్యవసరం. ఇందులో ముందుగా పాటించాల్సిన విషయం అన్నం తీసుకోవడం మానేయాలి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అన్నం తినే అలవాటు ఉన్నవారు ఎక్కువగా తీసుకోవడం వల్ల పని తక్కువ ఆహారం ఎక్కువగా శరీరంలో చేరిపోతుంది. అందుకే ఖర్చయ్య క్యాలరీల సంఖ్య తగ్గిపోతుంది. 
10 Health Risks Of Being Overweight Or Obese - HealthifyMe
సాధారణంగా వ్యవహారం తీసుకుంటే ఎంత క్యాలరీలో శరీరంలో చేరుతాయో చాలా మందికి అవగాహన ఉండదు. 150 గ్రాముల రైస్ తో 500 క్యాలరీలు శరీరంలో చేరుతాయి. పాలిష్ పట్టిన రైస్ లో క్యాలరీలు తప్ప ఇంకా ఎలాంటి ప్రోటీన్స్ ఉండవు. అందుకే రైస్ కు బదులు జొన్న రొట్టె, రాగి రొట్టె, పుల్కా లాంటివి ఏవైనా తీసుకోవచ్చు. పాలిష్ పట్టని మల్టీ గ్రీన్ రొట్టె ఏదైనా ఆరోగ్యానికి మంచిదే. ఏ పిండినైనా ఓ 20 గ్రాములు తీసుకొని రొట్టెగా తీసుకుంటే దాంతో 70 క్యాలరీలు అందుతాయి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్ ఫైబర్ అందుతాయి.
బరువు తగ్గాలి అనుకునేవారు మిల్లెట్స్ తీసుకోవడం కూడా మంచిదే. అయితే కష్టపడి పని చేసేవారు వీటిని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పటికీ ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఉద్యోగాలు చేసేవారు కేవలం బరువు తగ్గాలి అనుకునేవారు వీటి పరిమాణం తగ్గించాల్సి ఉంటుంది. మిల్లెట్స్ లో అన్ని సమానంగా క్యాలరీలను కలిగి ఉంటాయి. 100 గ్రాముల మిల్లెట్స్ పిండితో 350 క్యాలరీలు అందుతాయి. అయితే వీటితో పాటు బరువు తగ్గే విషయంలో కూరగాయలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా తక్కువ క్యాలరీలు ఉన్నవి వెజిటేబుల్స్ లోనే.
What is being overweight or obese, and where can you find help?
మొదట్లో బరువు తగ్గే సమయంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కడుపు నింపడానికి కాయగూరలనే ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఏ వెజిటేబుల్ లోనైనా అర కేజీలో కేవలం 100 గ్రాములు మాత్రమే క్యాలరీలు ఉంటాయి. అందుకే వీటిని ఎంత తీసుకున్న ఎలాంటి సమస్య ఉండదు.
కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, డయాబెటిస్, షుగర్, బిపి, మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. కొలెస్ట్రాల్ పెరగదు ఫైల్స్ వంటి సమస్యలు సైతం అదుపులో ఉంటాయి. వెజిటేబుల్స్ తో పాటు రోజూ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. నిజానికి ఆకుకూరలే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి మిల్లెట్ రైస్ సైతం తీసుకోకుండా కేవలం రెండు మూడు పుల్కాలు తో రోజు కాయగూరలు ఎక్కువగా తీసుకోవడంతో మంచి ప్రయోజనాలు ఉంటాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.