అమ్మమ్మల కాలం నాటి ఉలవచారు రసం.. కొత్తగా ఇలా ట్రై చేస్తే సరి..!

ఉలవచారు రసం చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు ఎంతో టేస్టీగా ఉండే ఈ రసం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా అమ్మమ్మల కాలం నాటి నుంచి ఎంతో ఫేమస్ అయిన ఈ ఉలవచారు రసం

అమ్మమ్మల కాలం నాటి ఉలవచారు రసం.. కొత్తగా ఇలా ట్రై చేస్తే సరి..!


ఉలవచారు రసం చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు ఎంతో టేస్టీగా ఉండే ఈ రసం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా అమ్మమ్మల కాలం నాటి నుంచి ఎంతో ఫేమస్ అయిన ఈ ఉలవచారు రసం చాలా ప్రాంతాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు. కొందరు వెల్లుల్లితో చేస్తే మరికొందరు ఉల్లిపాయలు తరిగి వేయించి రసం తయారు చేస్తారు. ఎలా తయారు చేసినా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా ఉలవలలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది. అయితే ఎప్పుడూ వండే ఉలవచారుకి ప్రత్యేకంగా కొత్త రుచిని ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉలవచారును కేవలం నాలుగంటే నాలుగు సింపుల్​ స్టెప్స్​ లో తయారు చేసుకోవచ్చు. ఉలవచారు రెసిపీని తయారు చేసుకోవడానికి ఉలవలను మొదటగా ఉడకబెట్టడం చాలా ఇంపార్టెంట్​. ప్రెషర్​ కుక్కర్ లో ఉలవలు, నీరు పోసి నాలుగైదు విజిల్స్​ వచ్చేంత వరకు వాటిని ఉడికించాలి. 

ఒక గ్రైండర్​ లో ఎండు కొబ్బరిని వేసి అందులో ఉల్లిగడ్డ, ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవలను అందులో వేసి గ్రైండ్​ చేయాలి. ఈ మూడు పదార్థాల మిశ్రమం బాగా మిక్స్​ అయ్యేంత వరకూ గ్రైండ్​ చేసుకోవాలి.

స్టవ్​ మీద ఒక ప్యాన్​ ను పెట్టి వేడి చేయాలి. అనంతరం ఆ ప్యాన్​ లో ఆయిల్​ ను పోసి వేడి చేసుకోవాలి. ప్యాన్​ లో పోసిన ఆయిల్​ వేడి అయిన తర్వాత ఆవాలు, ఇంగువ వేయాలి. అనంతరం అందులో రెండు గ్లాసుల నీటిని ప్యాన్ లో పోసి ముందుగా గ్రైండ్​ చేసిన ఉల్లిగడ్డ మరియు ఉడకబెట్టిన ఉలవలను వేసి కలుపుకోవాలి. ఇలా ప్యాన్​ లో వేసిన అన్ని పదార్థాలు బాగా మిక్స్​ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న రసానికి రసం పౌడర్ కలుపుకోవాలి ఇంతలోనే చింతపండు గుజ్జుని కూడా వేసి కలపాలి.

కొందరు బెల్లాన్ని ఇష్టంగా తింటారు. అలాంటి వారు  బెల్లాన్ని కూడా కలుపుకోవచ్చు. ఇక చివరగా రసంలో ఉప్పు వేసి మరింగా మరగబెట్టాలి. రసం చిక్కగా అయిన తర్వాత ప్యాన్​ ను స్టవ్​ మీది నుంచి దించే ముందు ఆ రెసిపీలో కొత్తిమీర ఆకులను వేసుకుంటే రసం టేస్టే మారిపోతుంది. దించిన తర్వాత రసాన్ని అన్నంతో పాటు కలుపుకుని తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ రసాన్ని ఫ్రిడ్జ్​ లో స్టోర్​ చేసుకుని తెల్లవారిన తర్వాత తింటే మరింత రుచిగా ఉంటుంది. ఇలా రసాన్ని చాలా సింపుల్​ స్టెప్స్​ లో తయారు చేసుకోవచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.