వంటింట్లో ఈ చిట్కాలు పాటించాల్సిందే!

చల్లబడిన చపాతీలపై కొద్దిగా నీళ్లు చల్లి మళ్లీ వేడిచేస్తే మెత్తగా మారుతాయి.

వంటింట్లో ఈ చిట్కాలు పాటించాల్సిందే!


- చల్లబడిన చపాతీలపై కొద్దిగా నీళ్లు చల్లి మళ్లీ వేడిచేస్తే మెత్తగా మారుతాయి.

- కుక్కర్‌ అడుగున పేరుకుపోయినట్లు ఉంటే వంట చేసేముందు ఒక నిమ్మచెక్క కుక్కర్‌లో వేసి ఉడికిస్తే సరి.

- ఇడ్లీ పాత్రలు నల్లబడితే డిటర్జెంట్‌ పౌడర్‌, వెనిగర్‌ కలిపి వాడేసిన టూత్‌బ్రష్‌తో తోమితే ఇడ్లీ పాత్రలు మెరుస్తాయి.

- పాలను కాచేముందు పాలల్లో కొద్దిగా విలాయిచీ పొడి వేసి కాస్తే పాలు విరగవు.

Precautions When Doing Kitchen Work After Cataract Surgery

- గారెలు మృదువుగా రావడానికి మినపప్పులో చారెడు పచ్చ పెసలు కలిపి రుబ్బితే గారెలు మృదువుగా వస్తాయి.

- ఏదైనా కూరలో లేదా చట్నీలో కారం ఎక్కువైతే కాస్తంత నిమ్మ రసం పిండితే సరి.

- పరుపులు, సోఫా స్పాంజీల కింద వేపఆకులు, తులసి ఆకులు పెట్టి ఉంచితే అవి క్రిమికీటకాలు, బ్యాక్టీరియా చేరదు.

- చెవిలో చీమ, లేదా పురుగు చొరబడితే త్వరగా బయటకు రావాలంటే టార్చిలైటు ఆన్‌ చేసి చెవిలోపలివైపు చూపాలి. క్షణాల్లోనే బయటికివస్తాయి.

- పటికబెల్లం ముక్కతో పులిపిర్ల మీద, మొటిమల మీద రుద్దితే ఫలితం కనిపిస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.